Mukesh Gowda: హీరోగా ఛాన్స్ కొట్టేసిన బుల్లితెర నటుడు ముఖేష్ గౌడ్!

  • November 11, 2023 / 10:00 PM IST

బుల్లితెరపై ప్రసారమవుతున్నటువంటి గుప్పెడంత మనసు సీరియల్ ఎలాంటి సక్సెస్ అందుకుందో మనకు తెలిసిందే. ఈ కార్యక్రమం ద్వారా ప్రేక్షకులకు పరిచయమయ్యారు నటుడు ముఖేష్ గౌడ్. ఈ సీరియల్లో రిషి పాత్రలో నటించినటువంటి ఈయన ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు.. ఇలా రిషి పాత్రలో నటిస్తూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ముఖేష్ గౌడ్ అదే స్థాయిలో అభిమానులను కూడా సొంతం చేసుకున్నారు. ఈ సీరియల్ ద్వారా ఈయనకు వచ్చినటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ చూసి ఏకంగా ఈయనకు సినిమా అవకాశాలు కూడా వస్తున్నాయి.

ఈ క్రమంలోనే త్వరలోనే హీరోగా వెండి తెరపై సందడి చేయడానికి సిద్ధమయ్యారు. ప్రియాంక శర్మ ముఖేష్ గౌడ్ హీరో హీరోయిన్లుగా గీత శంకరం అనే సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. నూతన దర్శకుడు రుద్ర దర్శకత్వంలో ప్రముఖ వ్యాపారవేత్త కె. దేవానంద్‌ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. నేడు ఈ సినిమా టైటిల్ ని ప్రకటిస్తూ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.

ఈ సినిమాకు గీతా శంకరం అని టైటిల్ ప్రకటిస్తూ విడుదల చేసిన ఈ పోస్టర్ ప్రస్తుతం వైరల్ గా మారింది. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ముఖేష్ గౌడ్ మాట్లాడుతూ.. బుల్లి తెర పై ప్రేక్షకులను ఎలా అయితే సందడి చేశానో వెండి తెరపై కూడా ప్రేక్షకులను అదే స్థాయిలో ఆకట్టుకుంటాననే గట్టి నమ్మకం తనలో ఉందని ఈయన తెలిపారు.

ఇక ఈ సినిమా లవ్ అండ్ ఎఫెక్షన్ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తప్పకుండా ఈ సినిమా యువతను బాగా ఆకట్టుకుంటుందని ఈయన తెలియజేశారు. తనకు హీరోగా సినిమాలలో అవకాశం కల్పించినటువంటి దర్శక నిర్మాతలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు కూడా తెలియజేశారు. ఈ సినిమా ద్వారా ఈయన హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారనే విషయం తెలియడంతో అభిమానులు కూడా రిషికి (Mukesh Gowda) శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus