మంచి కథ ఉంటే బ్లాక్ బస్టర్ హిట్ అయ్యేది

  • February 4, 2019 / 07:28 AM IST

కొన్ని సినిమాలు చూస్తున్నప్పుడు ఒకరకమైన ఎమోషన్ కి లోనవుతుంటాం. కొన్ని సినిమాలు మొదలైన 10 నిమిషాలకే మంచి సినిమా చూస్తున్నామనే భావన కలిగిస్తే.. ఇంకొన్ని మొదలైన 5 నిమిషాలకే నీరసం తెప్పిస్తాయి. ఇంకొన్ని సినిమాలు ప్రధామార్ధం అద్భుతం అనిపించి.. ద్వితీయార్ధం మాత్రం నీరుగార్చేస్తాయి. ఆ విధంగా ఫస్టాఫ్ లో విశేషంగా ఎగ్జైట్ చేసి.. సెకండాఫ్ కి వచ్చేసరికి ఢీలాపడిపోయిన సినిమా “సర్వం తాళమయం”. కెమెరామెన్ టర్నడ్ డైరెక్టర్ రాజీవ్ మీనన్ తెరకెక్కించిన ఈ చిత్రం తమిళ వెర్షన్ గత శుక్రవారం విడుదలైంది.

రెహమాన్ సంగీతం బిగ్గెస్ట్ ఎస్సెట్ గా నిలిచిన ఈ చిత్రం మ్యూజిక్ లవర్స్ ని విశేషంగా ఆకట్టుకొంది. కర్ణాటిక్ సంగీతం నేర్చుకోవాలనే ఓ క్రైస్తవ కుర్రాడి జీవితం నేపధ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఫస్టాఫ్ అద్భుతంగా ఉండగా.. సెకండాఫ్ మాత్రం సరైన కథనం లేక ఢీలాపడింది. దాంతో క్లాసిక్ సినిమాగా నిలవాల్సిన “సర్వం తాళమయం” యావరేజ్ సినిమాగా మిగిలిపోయింది. త్వరలోనే తెలుగులోనూ ఈ చిత్రాన్ని అనువాద రూపంలో విడుదల చేయాలనుకుంటున్నారు. మరి తెలుగు ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus