H Vinoth: శ్రీలీలను కాకుండా మమితను ఎందుకు తీసుకున్నారు? డైరక్టర్ ఆన్సర్ ఇదే
- July 22, 2026 / 07:10 PM ISTByFilmy Focus Desk
‘భగవంత్ కేసరి’ సినిమాలో బాలకృష్ణ నటనకు ఎంత మంచి పేరు వచ్చిందో.. అందులో కీలక పాత్రలో నటించిన శ్రీలీలకు కూడా అంతే పేరొచ్చింది. జాతీయ అవార్డుల్లో ఉత్తమ నటి, ఉత్తమ సినిమాలు లాంటివి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు అనే చర్చ ఈ మద్య మొదలైంది. ఎందుకంటే ఇలాంటి కథలకు నేషనల్ అవార్డ్స్ ఈ మధ్య పట్టం కడుతున్నాయి. అయితే ఇలాంటి సినిమాను రీమేక్ చేస్తున్నప్పుడు ఆమె పాత్రలో ఆమెనే ఎందుకు తీసుకోలేదు అనే చర్చ కోలీవుడ్ వర్గాల్లో నడుస్తోంది. దీనిపై ఆ సినిమా దర్శకుడు హెచ్.వినోద్ స్పందించారు.
H Vinoth
‘జన నాయగన్’ సినిమాకు మూలం బాలకృష్ణ – అనిల్ రావిపూడి సినిమా ‘జన నాయగన్’ అని ఇటీవల దర్శకుడు క్లారిటీ ఇచ్చారు. సగం ఆ సినిమా, సగం కొత్త కథ అని చెబుతున్నారు. ఆ సంగతేంటో సినిమా 23న రిలీజ్ అయ్యాక కానీ తెలియదు. అయితే మాతృక సినిమాలో శ్రీలీల పాత్రను మమితను తీసుకున్నారు. దీనికి కారణం ‘ప్రేమలు’ సినిమా అని చెప్పారాయన. విజయ్‌కి కూతురు పాత్రలో ఆమె అయితే బాగుంటుంది అనిపించింది. మా టీమ్ అంతా ఆ మాటకు ఓకే అనడంతో ఎంపిక చేశాం అని చెప్పారు.

మమితను లేడీ విజయ్ అని చెప్పొచ్చు. ఆమెకు భారీ యాక్షన్ సన్నివేశాలు ఇచ్చినా అదరగొట్టింది. ఆమె నటన, యాక్షన్ చూసి విజయ్ సెట్స్‌లో మెచ్చుకున్నారు. తొలి రోజుల్లో మమితకు యాక్షన్ సీన్స్ తక్కువగా పెడదాం అనుకున్నాం. కానీ ఆమెనే నేను యాక్షన్ సీన్స్‌కి రెడీ అని చెప్పింది. అంతేకాదు ఆమె పాత్రల ఎంపిక కూడా అదిరిపోతోంది. ‘డ్యూడ్’ సినిమాలో చేసిన పాత్రను ఇతర హీరోయిన్లు చాలామంది చేయడానికి ధైర్యం కూడా చేయరు అంటూ పొగిడేశారు హెచ్.వినోద్.
ఇక ఈ సినిమా సంగతి చూస్తే. విజయ్ హీరోగా నటించిన ఆఖరి (ఇప్పటికి) సినిమా ఇది. జులై 23న సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు.
















