Mirai 2: రెండో ‘మిరాయ్’.. కొరియన్ పిల్లతోపాటు అమెరికన్ తెలుగమ్మాయిని తీసుకున్నారా?
- October 27, 2026 / 10:40 AM ISTByFilmy Focus Desk
‘వైబ్ ఉంది బేబీ వైబ్ ఉంది లే..’ అంటూ ‘మిరాయ్’ సినిమాలో తేజ సజ్జా, రితికా నాయక్ కలసి చేసిన డ్యాన్స్, ఇద్దరి పెయిర్ భలే క్యూట్‌గా అనిపించింది. ఇప్పటివరకు తేజ నటించిన సినిమాల్లో పెయిర్స్‌లో ఇది బెస్ట్ అని అందరూ అనుకున్నారు. అయితే ఇప్పుడు తేజ రెండో ‘మిరాయ్’ కోసం వైబ్‌ని మార్చేయాలని చూస్తున్నాడట. ఆ సినిమాలో హీరోయిన్ కొత్తమ్మాయిని కాకుండా స్టార్ హీరోయిన్ని ఎంపిక చేసే పనిలో పడ్డారట.
Sreeleela
ఇటీవల చిత్రీకరణ ప్రారంభించుకున్న ‘మిరాయ్ 2’ సినిమా పెద్దగా హడావుడి లేకుండా, లీక్స్‌కి తావు ఇవ్వకుండా షూటింగ్ జరుపుకుంటూ వెళ్తోంది. ఈ క్రమంలో సినిమా కాస్టింగ్ పనులను కూడా వేగవంతం చేస్తున్నారట. మొదటి భాగంలో ఉన్న క్యాస్టింగ్‌తో పాటు కొన్ని అదనపు ఆకర్షణలు జోడిస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలో ఓ పాత్ర కోసం శ్రీలీల మీద ఫొటో షూట్ చేసినట్లు సమాచారం. అయితే, ఆ పాత్ర హీరోయిన్ కాదని, ఓ ముఖ్య పాత్ర అని చెబుతున్నారు.

అన్నట్లు ఈ సినిమాలో ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా కూడా నటిస్తున్నాడట. ఇది కూడా కీలక పాత్రనే అని సమాచారం. అయితే అది విలనా? లేక ఇంకేదైనేనా అనేది తెలియాల్సి ఉంది. పాన్ ఇండియా లెవల్లో సినిమా రూపొందుతుండటంతో ఈ సినిమాకు అదనపు ఆకర్షణలు తీసుకురావాలని దర్శకుడు కార్తిక్ ఘట్టమనేని ప్లాన్ చేస్తున్నారట. తొలి సినిమా సాధించిన విజయానికి డబుల్ ఇప్పుడు కావాలని అనుకోవడమే ఈ యాడ్ ఆన్స్కి కారణం అని తెలుస్తోంది.
ఈ సినిమా వచ్చే ఏడాది సెకండాఫ్‌లో రిలీజ్ చేయాలని చూస్తున్నారట. అయితే ముందుగా రిలీజ్ డేట్ చెప్పేసి టెన్షన్ పడకుండా.. అంతా రెడీ అయ్యాక డేట్ అనౌన్స్ చేయాలని చూస్తున్నారట. మరి కొరియన్ పిల్ల, తెలగు అమెరికన్ అమ్మాయి మధ్య తేజ సజ్జా ఎలా కనిపిస్తాడో చూడాలి.












