బిగ్ బాస్ నాన్ స్టాప్ హౌస్ లో రోబో టాస్క్ చాలా ఆసక్తికరంగా జరిగింది. ఈ టాస్క్ లో బిందు, అరియానా, ఇంకా అషూరెడ్డిలు రోబో ఫ్యాక్టరీ నడిపే యజమానులుగా మారారు. వాళ్లు సప్లయిర్స్ అయిన హౌస్ మేట్స్ దగ్గర మెటీరియల్ కొనుక్కుని పూర్తిగా రోబోని అసెంబుల్ చేయాలి. అయితే, మొదటిరోజు నిర్లక్ష్యంగా ఆడిన బిందుమాధవి దగ్గర అన్ని బిట్ క్వాయిన్స్ ని కొట్టేసింది హమీదా. ఆ తర్వాత బిందుకి గేమ్ ఆడే స్కోప్ లేకండా పోయింది. ఎవరి దగ్గరా మెటీరియల్ కొనుక్కోలేదు.
ఆమె కంపెనీ నుంచీ ఒక్క రోబో కూడా చేయలేదు. దీంతో అషూరెడ్డి ఇంకా అరియానాల మద్యలోనే గట్టి పోటీ సాగింది. ఇక్కడ అరియానాని గెలిపించేందుకు బిందు గట్టిగా ట్రై చేసింది. కానీ, తనకోసం గేమ్ ఆడుతున్నానని చెప్పింది. అలాగే, స్రవంతి కూడా అరియానా కోసం గేమ్ ఆడింది. ఇక సప్లయిర్స్ విషయానికి వస్తే హౌస్ లో అత్యధికంగా బిట్ క్వాయిన్స్ ని సొంతం చేసుకుంది హమీదా. టాస్క్ మొదటి లెవల్లోనే ఏకంగా 240 క్వాయిన్స్ ని సంపాదించింది.
అందరికంటే టాప్ లో ఉంది హమీదా. ఆ తర్వాత యాంకర్ శివ కూడా ఎక్కువ క్వాయిన్స్ ని సంపాదించాడు. రెండో లెవల్ టాస్క్ లో కూడా హమీదానే టాప్ లో నిలిచింది. హమీదాతో పాటుగా యాంకర్ శివ, ముమైత్ ఖాన్ లు సెకండ్ , థర్డ్ ప్లేస్ లలో నిలిచి కెప్టెన్సీ పోటీదారులు అయ్యారు. కంపెనీ నుంచీ ఎక్కువ రోబోలని తయారు చేసిన అషూరెడ్డి కెప్టెన్సీ పోటీదారులుగా నిలిచింది. అషూరెడ్డికి, అఖిల్ ఇంకా అజయ్, ముమైత్ ఖాన్ లు హెల్ప్ చేశారు.
ఈవారం కెప్టెన్సీ టాస్క్ లో సపోర్టింగ్ టాస్క్ ఏదైనా వస్తే హౌస్ లో మెజారిటీ యాంకర్ శివకి చేసే అవాకశం కనిపిస్తోంది. ఎందుకంటే, హమీదా, అషూరెడ్డి, ముమైత్ లతో పోలిస్తే హౌస్ లో శివకి సపోర్టింగ్ ఎక్కువగానే ఉంది. అలాంటి టాస్క్ వస్తే ఖచ్చితంగా ఈవారం యాంకర్ శివనే కెప్టెన్ అయ్యే ఛాన్స్ ఉంది. మరి చూద్దాం.. ఏం జరగబోతోంది అనేది.