Hansika: మొత్తానికి ఓపెన్ అయిపోయిన హన్సిక భర్త..!

ఒకప్పటి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ హన్సిక గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ‘దేశముదురు’ తో ఈమె టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. ఈమె కోసమే ఆ సినిమాని అప్పటి యూత్ రిపీటెడ్ గా చూశారు. కానీ ఆ తర్వాత ఆ స్థాయి సక్సెస్ ఈమెకు దక్కలేదు. కానీ ‘బిల్లా’ ‘మస్కా’ ‘కందిరీగ’ ‘దేనికైనా రెడీ’ వంటి హిట్ సినిమాల్లో నటించింది. తర్వాత తమిళంలో వరుస సినిమాలు చేసి స్టార్ గా ఎదిగింది. అక్కడ కూడా ఆఫర్లు కరువయ్యాక పెళ్లి చేసుకుని సినిమాలు తగ్గించింది.

Hansika

హన్సిక 2022 డిసెంబర్ 4న తన చిన్ననాటి స్నేహితుడు, బిజినెస్ పార్ట్నర్ అయిన సొహైల్ కతూరియాని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి డిసెంబర్ 4న వీరి వివాహం రాజస్థాన్ లోని రాజకోటలో అంగరంగ వైభవంగా జరిగింది. అయితే కొన్నాళ్లుగా ఈ జంట వేరుగా ఉంటున్నారు అంటూ కథనాలు పుట్టుకొచ్చాయి. సోషల్ మీడియాలో వీరు కలిసి ఉన్న ఫోటోలు ఎక్కువగా షేర్ చేయకపోవడం వల్లనే ఈ వార్తలు ఊపందుకున్నాయి అని చెప్పాలి.

సోహైల్ పెద్ద ఫ్యామిలీకి చెందిన బిజినెస్ మెన్. కానీ హన్సిక రేంజ్ అంత కాదు. దీంతో ఆమె అతని ఫ్యామిలీలో కలవలేకపోతుంది.. అందుకే వీళ్ళు విడాకులు తీసుకోబోతున్నారు అంటూ ప్రచారం మొదలైంది. తాజాగా ఈ ప్రచారం పై హన్సిక భర్త సోహైల్ స్పందించాడు. అతను మాట్లాడుతూ.. “హన్సిక, నేను దూరంగా ఉంటున్నాం, విడాకులు తీసుకోబోతున్నాం అంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదు. అది వట్టి రూమార్. మేము ఫ్యామిలీ లైఫ్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నాం” అంటూ క్లారిటీ ఇచ్చారు.

పేరు మారిన విజయ్‌ దేవరకొండ సినిమా.. ఎవరికీ రాకూడని కష్టమిది!

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus