తేజ సజ్జ,దర్శకుడు ప్రశాంత్ వర్మ కాంబినేషన్లో ‘జాంబీ రెడ్డి’ వంటి సూపర్ హిట్ మూవీ తర్వాత రూపొందిన సినిమా ‘హను -మాన్’. టీజర్ తోనే అందరి దృష్టిని ఆకర్షించిన ఈ సినిమా ట్రైలర్ అయితే భారీ అంచనాలు ఏర్పడేలా చేసింది. జనవరి 12 న అంటే మరికొన్ని గంటల్లో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.ఆల్రెడీ ప్రీమియర్ షోలు పడ్డాయి. సినిమా చూసిన ప్రేక్షకులు పాజిటివ్ రెస్పాన్స్ చెబుతున్నారు. సూర్ షాట్ బ్లాక్ బస్టర్ మూవీ ఇది అంటూ నెటిజెన్లు కామెంట్లు.
ఆ రకంగా సంక్రాంతి బాక్సాఫీస్ ఓ బ్లాక్ బస్టర్ సినిమాతో ఓపెన్ అయ్యింది అని చెప్పాలి. అయితే ‘హను-మాన్’ సినిమాకి థియేట్రికల్ బిజినెస్ బాగా జరిగింది. నాన్ థియేట్రికల్ రైట్స్ కూడా మంచి రేటుకి అమ్ముడయ్యాయి అని తెలుస్తుంది. ముఖ్యంగా డిజిటల్ రైట్స్ ను అంటే ఓటీటీ హక్కులను ‘జీ5’ సంస్థ కొనుగోలు చేసింది. ఆ రకంగా ‘హనుమాన్’ ఓటీటీ పార్ట్నర్ లాక్ అయినట్టు స్పష్టమవుతుంది. అయితే డిజిటల్ స్ట్రీమింగ్ ఎప్పటి నుండీ ఉంటుంది అనేది అందరిలోనూ క్యూరియాసిటీని పెంచుతుంది.
అందుతున్న సమాచారం ప్రకారం.. సినిమా రిలీజ్ అయిన 5 వారాల తర్వాత (HanuMan) ‘హను – మాన్’ ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆ రకంగా చూసుకుంటే ఫిబ్రవరి 16 , 17 తేదీల్లో ‘హనుమాన్’ డిజిటల్ రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ సినిమా లాంగ్ రన్ పడితే.. ఇంకో రెండు వారాలు డిలే అయ్యే ఛాన్స్ ఉంది.
గుంటూరు కారం సినిమా రివ్యూ & రేటింగ్!
హను మాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గుంటూరు కారం’ తో పాటు 24 గంటల్లో రికార్డులు కొల్లగొట్టిన 15 ట్రైలర్ల లిస్ట్..!