Hanu Man: ఆ ఏరియాలో ‘ఆదిపురుష్’ నష్టాలు తీర్చిన ‘హనుమాన్’.!

‘హనుమాన్’ టీజర్ అందరి దృష్టిలో పడింది అంటే ‘ఆదిపురుష్’ వల్ల. ఎందుకంటే దర్శకుడు ఓం రౌత్ రూ.500 కోట్ల బడ్జెట్ తో ‘ఆదిపురుష్’ ని చాలా చీప్ వీఎఫ్ఎక్స్ తో తెరకెక్కించాడు. గ్లింప్స్ నుండీ ఈ విషయం పై అందరికీ ఓ క్లారిటీ వచ్చేసింది. అదే టైంలో ‘హనుమాన్’ టీజర్ అందరి దృష్టిని ఆకర్షించింది. తక్కువ బడ్జెట్ లో ‘ఆదిపురుష్’ కంటే క్వాలిటీ విజువల్స్ అందులో కనిపించడంతో.. ‘హనుమాన్’ పై అందరి దృష్టి పడింది.

దర్శకుడు ప్రశాంత్ వర్మ పై అప్పటి నుండి పొగడ్తల వర్షం కురుస్తూనే ఉంది. ‘హనుమాన్’ కి సంబంధించిన కంటెంట్ ఏది బయటకు వస్తున్నా సరే.. అదే టైంలో ‘ఆదిపురుష్’ ట్రోలింగ్ లో నిలుస్తూ వస్తుంది. ముఖ్యంగా దర్శకుడు ఓం రౌత్ ను నెటిజన్లు ఓ రేంజ్లో ట్రోల్ చేస్తూ వస్తున్నారు. సరే ఇక ఇప్పుడు అసలు విషయానికి వెళ్ళిపోదాం. ‘ఆదిపురుష్’ చిత్రాన్ని నైజాంలో ‘మైత్రి’ సంస్థ డిస్ట్రిబ్యూట్ చేసింది. ఓపెనింగ్స్ పర్వాలేదు అనిపించినా..

చివరికి రూ.15 కోట్లు నష్టం వచ్చినట్లు తెలుస్తుంది. ఆ నష్టాలు ఇప్పుడు (Hanu Man) ‘హనుమాన్’ వల్ల తీరిపోయాయి అని ట్రేడ్ పండితుల సమాచారం. ఈ చిత్రాన్ని కూడా ‘మైత్రి’ వారే రిలీజ్ చేశారు. నైజాంలో ‘హనుమాన్’ ని రూ.7.2 కోట్లకి కొనుగోలు చేయగా…. ఇప్పుడు దాదాపు రూ.25 కోట్లు షేర్ ను రాబట్టింది. ఆ రకంగా ‘ఆదిపురుష్’ నష్టాలు కూడా ‘హనుమాన్’ తీర్చేసింది అని చెప్పాలి.

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus