Hanu Raghavapudi: హను కొత్త సినిమాకి అదొక్కటే బ్యాలెన్స్‌ అట

ప్రేమకథలందు హను రాఘవపూడి ప్రేమకథలు వేరయా! అని అంటుంటారు. అంతలా తన ప్రేమకథల సినిమాలతో ప్రేక్షకుల్ని అలరించారాయన. ఆయన సినిమాల ఫలితం తేడా కొట్టినా.. అందులోని ప్రేమకథ మాత్రం అద్భుతంగా ఉంటుంది అని అంటుంటారు. తాజాగా ఆయన తెరకెక్కించిన ప్రేమకావ్యం ‘సీతారామం’ బాక్సాఫీసు దగ్గర అదరగొడుతోంది. ఈ సినిమా తర్వాత హను ఏ సినిమా చేస్తారు అనేది ఇప్పుడు ప్రశ్న. దీనికి సమాధానంగా చరిత్ర అనే పేరు వినిపిస్తోంది.

అవును, హను రాఘవపూడి నెక్స్ట్‌ సినిమా హిస్టారికల్‌ లవ్‌ స్టోరీ అని అంటున్నారు. అంటే చరిత్ర పుటల్లోంచి ఓ ప్రేమకథను తీసుకొని దానిని సినిమా రూపంలో అందించాలని హను రాఘవపూడి ఆలోచిస్తున్నారట. మైత్రీ మూవీ మేకర్స్‌లో హను తన నెక్స్ట్‌ సినిమా చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఇటీవల మైత్రీ టీమ్‌కు హను ఓ కథ పాయింట్‌ చెప్పారట. హిస్టారికల్‌ ఫిక్షన్‌ కథగా ఈ సినిమా ఉంటుంది అని చెబుతున్నారు. మైత్రీ టీమ్‌ ఊ కొట్టడంతో పూర్తి కథను సిద్ధం చేసే పనిలో హను ఉన్నారట.

నిజానికి హను రాఘవపూడి తన తర్వాతి సినిమా కోసం తన కంఫర్ట్‌ జోనర్‌ నుండి బయటకు వచ్చేస్తారని వార్తలొచ్చాయి. అయితే.. పూర్తిగా కాకుండా నేపథ్యం వరకే హిస్టరీని తీసుకోవాలని అనుకుంటున్నట్లు తాజా సమాచారం. అయితే ఈ సినిమాకు హీరో ఎవరు అనేది ఇంకా తేలలేదు. మైత్రీ మూవీ మేకర్స్‌ దగ్గర పెద్ద హీరోలు, కుర్ర హీరోల డేట్స్‌ చాలానే ఉన్నాయి. ‘సీతారామం’ లాంటి హిట్‌ ఇచ్చాడు కాబట్టి హనుతో సినిమా చేయడానికి హీరోలు ఇప్పుడు ముందుకొస్తారు.

హను రాఘవపూడి తన ప్రేమకథల జోనర్‌ నుండి బయటికొచ్చి ఆ మధ్య చేసిన ‘లై’ సినిమా ఇబ్బంది పెట్టింది. ఈ నేపథ్యంలోనే పూర్తిగా జోనర్‌ మార్చుకోవడానికి హను ముందుకు రావడం లేదు అని కూడా అంటున్నారు. అలా అని మూస ధోరణి అని అనే అవకాశం లేకుండా మిక్స్‌ అండ్‌ మ్యా్‌ కాన్సెప్ట్‌లో తర్వాతి సినిమా చేద్దాం అని హను అనుకుంటున్నట్లు భోగట్టా.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus