హను రాఘవపూడి కొత్త సినిమా ఇదే అవుతుందా?

సెకండాఫ్‌ విషయంలో క్లారిటీ ఉండదు, ఎక్కడో మిస్‌ అవుతుంటాడు, అందుకే వరుసగా సినిమాలు తేడా కొడుతున్నాయ్‌ అంటూ హను రాఘవపూడి మీద విమర్శలు ఉంటాయి. గత చిత్రాల ప్రభావం అంతగా పడింది ఆయన మీద. అయితే ఇప్పుడు ఆయన కాన్ఫిడెన్స్‌ ఫుల్ హైలో ఉంది. ‘సీతా రామం’ సినిమా విజయం ఇచ్చిన ఊపు అది. ఈ క్రమంలో ఆయన చాలా రోజులుగా అనుకుంటున్న మల్టీస్టారర్‌ సినిమాను పట్టాలెక్కించాలని అనుకుంటున్నాడట. త్వరలోనే దీనిపై ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉంది అంటున్నారు.

హను రాఘవపూడి అంటే.. భావుకత ఉన్న ప్రేమకథలు, హృద్యమైన సినిమాలు చేస్తారని పేరు. అయితే ఆ సినిమా బాక్సాఫీసు దగ్గర ఆకట్టుకోవడంలో మాత్రం విఫలమవుతూ ఉంటాయి. అయితే ఆయన మధ్యలో తన పంథా మార్చుకున్నా.. ఆ తర్వాత మళ్లీ వెనక్కి వచ్చి చేసిన చిత్రం ‘సీతా రామం’. ఈ సినిమా మంచి విజయం అందుకోవడంతో ఆయన బ్యాక్‌ టు పేస్‌ అయ్యారట. అందుకే ఓ మల్టీస్టారర్‌ మూవీ ప్లాన్‌ చేస్తున్నారట. అయితే అగ్ర హీరోలతో కాదు. కుర్ర కథానాయకులతో అట.

‘సీతా రామం’ తర్వాత హను ఏం సినిమా చేస్తారు అనే ప్రశ్న చాలామంది అడుగుతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌ మీద ఈ సినిమా ఉంటుంది అని మాత్రం ఫిక్స్‌. కుర్ర హీరోతో సినిమా ఉండొచ్చు అని అయితే వార్తలొచ్చాయి. అయితే ఇప్పుడు ఒక హీరో కాదు, ఇద్దరు హీరోలు అని వార్తలొస్తున్నాయి. హను కొత్త సినిమాలో ఇద్దరు యువ హీరోలు నటిస్తారట. అంతేకాదు ఆ సినిమా కూడా ప్రేమకథే అవుతుంది అని చెబుతున్నారు. ఇది హ‌ను డ్రీమ్ ప్రాజెక్ట్ లాంటిద‌ని తెలుస్తోంది.

ఈ మల్టీస్టారర్‌ ప్రేమ కథ ఆలోచన హ‌నుకి ఎప్ప‌టి నుండో ఉందట. ఓ మంచి హిట్టు కొట్టి, తనపై ఇండస్ట్రీకి నమ్మకం బాగా వచ్చాక కలల ప్రాజెక్ట్‌ మొదలుపెడదాం అనుకున్నారట. అందుకే ఇప్పుడు బయటకు తీయాలని చూస్తున్నారట. అయితే ఈ సినిమాలో ఆ ఇద్దరు హీరోలు తెలుగు నుండే ఉంటారా? లేక ఓ తెలుగు హీరో, మరో భాష నుండి ఇంకో హీరో ఉంటారా? అనేది తెలియాలి. హీరోయిన్లు అయితే తెలుగు నుండి కాకుండా ఇతర భాష నుండే ఉంటారు అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus