పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) ఇప్పుడు మళ్లీ ప్రచార హంగామాతో వార్తల్లో నిలుస్తోంది. కొన్ని సంవత్సరాలుగా నిర్మాణంలో ఉన్న ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామాకు ఇటీవలే డైరెక్షన్ బాధ్యతలు స్వీకరించిన జ్యోతి కృష్ణ (Jyothi Krishna) , సినిమా ప్రమోషన్స్‌ను జోరుగా నడిపిస్తున్నారు. ట్రైలర్, పాటల విడుదలతో పాటు, ఇతర భాషల్లో సినిమా మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ భారీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం, సినిమా ట్రైలర్‌ను నార్త్ ఇండియాలో గ్రాండ్‌గా లాంచ్ చేయాలనే ఆలోచనలో ఉంది చిత్రబృందం.
హైదరాబాదులో కాకుండా ఢిల్లీ, లక్నో, జైపూర్ వంటి నగరాల్లో లాంచ్ ఈవెంట్ కోసం వేదికపై చర్చలు సాగుతున్నాయి. పాన్ ఇండియా మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకొని, ఉత్తర భారతదేశ ప్రేక్షకుల మనస్సులను ఆకర్షించేందుకు పవన్ మార్కెట్‌ను వాడుకోవాలన్న ఆలోచనతో ముందుకెళ్తున్నారు. ఇదిలా ఉండగా, మే 28న రిలీజ్ కానున్న నాలుగో సింగిల్‌కు సంబంధించిన బజ్ కూడా పెరుగుతోంది. ఈ ఐటెం సాంగ్‌లో కొన్ని లైన్లను పవన్ స్వయంగా మార్పులు సూచించారట.
పాటల ఎంపికలోనూ స్క్రీన్‌పై విజువల్స్ ప్రెజెంటేషన్‌లోనూ పవన్ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని యూనిట్ చెబుతోంది. మరోవైపు, నిధి అగర్వాల్‌తో (Nidhhi Agerwal) పాటు పవన్ కూడా ప్రమోషన్ ఇంటర్వ్యూలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ప్రధానంగా ఇప్పుడు అందరి దృష్టి నార్త్ ఇండియా లాంచ్ వేడుకలపైనే ఉంది. ఇప్పటికే ‘పుష్ప 2’ (Pushpa 2) , ‘గేమ్‌చేంజర్’ (Game Changer) వంటి చిత్రాలు నార్త్ లో ప్రమోషన్ ఈవెంట్స్ తో హడావుడి చేశాయి.
ఇక ‘హరిహర వీరమల్లు’ కూడా అదే దిశగా ముందుకెళ్తుండడం విశేషం. జూన్ 12న ఐదు భాషల్లో ఈ చిత్రం విడుదల కానుండటంతో, ముందు నుంచే సదరు మార్కెట్లలో బ్రాండ్ బిల్డింగ్ ప్రారంభించేందుకు టీమ్ సిద్ధమైంది. సినిమాలో బాబీ డియోల్ పాత్రకు సంబంధించిన హైప్, ఎఎమ్ రత్నం (AM Rathnam) నిర్మాణ విలువలు, పవన్ స్క్రీన్ ప్రెజెన్స్ అన్నీ కలిసివచ్చి ఇది పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటుతుందని ఆశిస్తున్నారు. ఇక చివరికి నార్త్ ఇండియాలో ‘వీరమల్లు’ ఎంత వరకు సందడి చేస్తాడో వేచి చూడాలి.