మాస్ మహారాజ్ రవితేజ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ రూపొందుతోంది. అదే ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. 2026 సంక్రాంతి రేసులోకి చాలా సైలెంట్ గా వచ్చి చేరింది ఈ సినిమా. ఎన్ని థియేటర్లు దొరుకుతాయో తెలీదు..తక్కువ దొరికినా బెంగ లేదు అన్నట్టు మేకర్స్ ప్రమోషన్స్ షురూ చేశారు. ఇందులో భాగంగా విడుదల చేసిన గ్లిమ్ప్స్ పెద్దగా ఆసక్తిని రేకెత్తించలేదు కానీ నిన్న రిలీజ్ చేసిన ‘బెల్లా బెల్లా’ సాంగ్ మాత్రం అందరినీ ఆకట్టుకుంటుంది.
భీమ్స్ సంగీతంలో రూపొందిన ఈ పాటకి ప్రధాన ఆకర్షణ అంటే రవితేజతో కలిసి హీరోయిన్ ఆషిక రంగనాథ్ చేసిన డాన్స్ అలాగే ఆమె గ్లామర్ అనే చెప్పాలి.

కళ్యాణ్ రామ్ ‘అమిగోస్’ తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఆషిక రంగనాథ్.. ఆ సినిమాతో పెద్దగా ఆడియన్ దృష్టిని ఆకర్షించుకోలేదు. పైగా ఆ సినిమా ప్లాప్ అవ్వడం వల్ల కమర్షియల్ గా కూడా ఈమెకు కలిసిరాలేదు. అయితే తర్వాత ఆమె చేసిన ‘నా సామి రంగ’ హిట్ అయ్యింది. ఆమె నటనకి కూడా మంచి మార్కులు పడ్డాయి. కానీ ఆ సినిమాలో ఆమెది డీ గ్లామరస్ రోల్.

సో గ్లామర్ తో అట్రాక్ట్ చేసే అవకాశం లభించలేదు. అయితే రవితేజతో చేస్తున్న ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమాలో ఈమె గ్లామర్ షో నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది అని సమాచారం.

నిన్న రిలీజ్ అయిన ‘బెల్లా బెల్లా’ సాంగ్లో ఆషిక గ్లామర్ హైలెట్ అయ్యింది. కచ్చితంగా ఈ సినిమా ఆమె కెరీర్ కి హెల్ప్ అయ్యే అవకాశం ఉందని ఇన్సైడ్ టాక్.
