సమంత రెండో పెళ్లి చేసుకుంది. ‘ఫ్యామిలీ మెన్’ డైరెక్టర్ రాజ్ నిడుమోరుతో ఆమె నిన్న 7 అడుగులు వేసింది. కానీ రాజ్ మొదటి భార్య స్యామిలి వీళ్ళపై విషం కక్కుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. వాస్తవానికి వీళ్ళ పెళ్లి వ్యవహారం పై ఫస్ట్ అప్డేట్ ఇచ్చింది ఆమెనే అని చెప్పాలి. ఆమె ఆవేదనని అర్ధం చేసుకునే ఏమో కానీ పూనమ్ కౌర్ వంటి హీరోయిన్లు, కొంతమంది సినిమా టెక్నిషియన్లు సమంత రెండో పెళ్లిపై కౌంటర్లు వేస్తూ పోస్టులు పెట్టారు.
‘ఇంకొకరి గూడు కూల్చేసి మనం ఇల్లు కట్టుకోవడం అన్యాయం’ అనే మీనింగ్ వచ్చేలా వాళ్ళు పోస్టులు చేశారు. ఇదే అలుసుగా తీసుకుని సమంత యాంటీ ఫ్యాన్స్ అలాగే కొందరు నాగ చైతన్య అభిమానులు సమంతని ట్రోల్ చేస్తున్నారు. ఈ క్రమంలో వాళ్ళు కొన్ని లాజిక్కులు క్రాక్ చేశారు.సమంత తన మొదటి భర్త నాగ చైతన్యతో 2021 లో విడాకులు తీసుకుంది.

సరిగ్గా ఏడాది తిరగకుండా రాజ్ 2022 లో తన భార్యకి విడాకులు ఇచ్చేశాడు. ‘ఫ్యామిలీ మెన్ సీజన్ 2’ కారణంగానే సమంత.. నాగ చైతన్య మధ్య చెడింది అనే ప్రచారం అప్పట్లో నడిచింది. 2020 లో ‘ది ఫ్యామిలీ మెన్ సీజన్ 2’ సిరీస్ ప్రారంభమైంది. ఆ సిరీస్లో నాగ చైతన్యకి ఇష్టం లేకుండా ఆమె ఇంటి*మేట్ సీన్స్ లో నటించిందని.. అందుకే వారి మధ్య మనస్పర్థలు వచ్చినట్టు అంతా చెప్పుకున్నారు.
విడాకులు ప్రకటించిన తర్వాత సమంత పై నాగ చైతన్య ఫ్యాన్స్ ట్రోలింగ్ జరిపారు. దాన్ని సమంత తనకు అనుకూలంగా మార్చేసుకుందని కొందరు చెప్పుకొచ్చారు. రాజ్ వల్ల పరిచయమైన ముంబై పీఆర్ టీంని వాడుకుని సమంత.. నాగ చైతన్యని విమర్శిస్తూ శోభితతో చైతన్య కలిసున్న ఫోటోలు లీక్ చేసి.. ఆమె వల్లే నాగ చైతన్యకి దూరమైనట్టు కలరింగ్ ఇచ్చింది.
కానీ ‘ఫ్యామిలీ మెన్’ సిరీస్ కారణంగానే ఇదంతా జరిగింది అని నిన్నటితో క్లారిటీ వచ్చింది అని చాలా మంది సోషల్ మీడియాలో ట్వీట్లు వేస్తున్నారు.
