ప్రగ్యా జైస్వాల్ పరిచయం అవసరం లేని పేరు. ‘మిర్చి లాంటి కుర్రాడు’ సినిమాతో నటిగా మారిన ఈమె క్రిష్ తెరకెక్కించిన ‘కంచె’ తో పాపులర్ అయ్యింది. తర్వాత గ్లామర్ డోస్ పెంచి ఎక్కువ ఆఫర్స్ పట్టాలని చూసింది. ఈ క్రమంలో ‘జయ జానకి నాయక’ ‘నక్షత్రం’ వంటి పెద్ద సినిమాల్లో ఛాన్సులు వచ్చినా అవి ఈమెకు కలిసిరాలేదు. లాక్ డౌన్ టైంలో ఈమె చేసిన గ్లామర్ షో మరెవ్వరూ చేయలేదు అనే చెప్పాలి.
దాని ఫలితం ‘అఖండ’ రూపంలో ఈమెను వరించింది. ఈమె కెరీర్లో పెద్ద సినిమా అని చెప్పుకోవాలన్నా.. పెద్ద హిట్ సినిమా అని చెప్పుకోవాలన్నా ‘అఖండ’ అనే చెప్పుకోవాలి. తర్వాత బాలయ్యతో కలిసి ఈమె ‘డాకు మహారాజ్’ లో కూడా నటించింది. ఆ సినిమా కూడా మంచి విజయం సాధించింది.

అయితే అనూహ్యంగా ఈమెను ‘అఖండ 2’ నుండి తప్పించడం మొన్నామధ్య హాట్ టాపిక్ అయ్యింది. కథ ప్రకారం ఈమె పాత్రని చనిపోయినట్టు సినిమాలో ప్రస్తావిస్తారట.

మెయిన్ పాయింట్ అంతా పాప చుట్టూ, అలాగే అఘోరా పాత్ర చుట్టూనే నడుస్తుంది అని టాక్. అందుకే ప్రగ్యా ‘అఖండ 2’లో భాగం కాలేకపోయింది అని సమాచారం.

ఇదిలా ఉండగా.. ప్రగ్యా జైస్వాల్ చేతిలో ప్రస్తుతం పెద్ద ఆఫర్లు అంటూ ఏమీ లేవు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన ‘టైసన్ నాయుడు’ సినిమాలో ఓ చిన్న పాత్ర చేస్తుంది. అది మినహా ఈమె చేతిలో పెద్ద ఆఫర్లు అయితే లేవు. ప్రస్తుతం ఈమె మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తుంది. ఈమె బికినీ ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మీరు కూడా ఓ లుక్కేయండి :
