హీరోయిన్ సమంత – రాజ్ నిడిమోరు జంట నిన్న ఇషా యోగ కేంద్రం వేదికగా కోయింబత్తుర్ లో పెళ్లి పీటలు ఎక్కిన సంగతి తెలిసిందే. వీరి వివాహానికి సంబంధించి స్వయంగా సమంత నే తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా పెళ్ళికి సంబందించిన ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫొటోలు ఇప్పుడు ఆన్ లైన్ లో వైరల్ గా మారాయి. సోషల్ మీడియా అంతా ఇదే హాట్ టాపిక్. కొంత మంది హీరోయిన్లు అయితే సమంతను డైరెక్ట్ గా టార్గెట్ చేస్తూ X వేదికగా ట్వీట్లు చేస్తున్నారు. తన అభిమానులు మాత్రం అభిమాన హీరోయిన్ ఈ వివాహ బంధంతో అయినా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నారు.
ఇది ఇలా ఉండగా సమంత మొదటి వివాహం గురించి అప్పట్లో జ్యోతిష్యం చెప్పి అభిమానుల ఆగ్రహానికి గురైన వేణు స్వామి మళ్లి వార్తల్లోకెక్కారు. సోషల్ మీడియా వేదిక ఒక వీడియో షేర్ చేసారు వేణు స్వామి. దాంట్లో సమంత వివాహం గురించిన న్యూస్ రాగానే ఉదయం నుంచి ఒకటే కాల్స్ చేస్తున్నారట కొంత మంది నెటిజన్లు. సమంత-రాజ్ ల భవిష్యత్ గురించి జ్యోతిష్యం చెప్పాలని అడుగుతున్నట్టు తెలిపాడు. ఇలా కాల్స్ చేస్తున్న వారందరికీ తాను ఒకటే చెప్పాలనుకుంటున్నాని తెలియజేస్తూ, తాను ఇలాంటి విషయాల గురించి స్పందించాలనుకోవటం లేదని, ఒక పెద్ద ప్రొడ్యూసర్ వారి సినిమా హిట్ కావాలని పూజ కార్యక్రమాలు చేయిస్తున్నారని 3 రోజులు గా వాటిలోనే నిమగ్నమయ్యి ఉన్నానని చెప్పుకొచ్చారు.

గతంలో నాగ చైతన్య-శోభిత జంటగా రెండవ వివాహం జరుగగా, దానిపై ఒక వీడియో చేసిన వేణు స్వామికి అక్కినేని అభిమానులు గట్టిగానే చురకలు అంటించటంతో ఇలాంటి విషయాలపై భవిష్యత్ లో స్పందించను అని అప్పట్లోనే క్లారిటీ ఇచ్చారు వేణు స్వామి.
