పవన్ కళ్యాణ్, దర్శకుడు జ్యోతి కృష్ణ కాంబినేషన్లో రూపొందిన చారిత్రాత్మక సినిమా ‘హరిహర వీరమల్లు’. జూన్ 24న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాని ఏ.ఎం.రత్నం భారీ బడ్జెట్ తో నిర్మించారు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో మొదలైన ఈ సినిమా తర్వాత కొన్ని కారణాల వల్ల ఆలస్యమవుతూ వచ్చింది. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండటం వల్ల ఈ సినిమాకి డేట్స్ కరెక్ట్ గా ఇవ్వలేకపోయారు. అందువల్ల సినిమా క్వాలిటీగా బయటకు రాలేదు అని జూలై 23న వేసిన ప్రీమియర్స్ తో ప్రేక్షకులు తేల్చేశారు.
నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. కానీ మొదటి సోమవారం కలెక్షన్స్ మరింతగా తగ్గాయి. ఒకసారి 5 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 16.38 cr |
సీడెడ్ | 7.77 cr |
ఉత్తరాంధ్ర | 6.49 cr |
ఈస్ట్ | 4.75 cr |
వెస్ట్ | 3.80 cr |
గుంటూరు | 4.42 cr |
కృష్ణా | 4.02 cr |
నెల్లూరు | 1.71 cr |
ఏపీ+తెలంగాణ | 49.34 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 4.75 cr |
ఓవర్సీస్ | 6.30 cr |
వరల్డ్ టోటల్ | 60.39 cr (షేర్) |
‘హరిహర వీరమల్లు’ చిత్రానికి రూ.120 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.121 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 5 రోజుల్లో ఈ సినిమా రూ.60.39 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.99 కోట్లు కొల్లగొట్టింది. బ్రేక్ ఈవెన్ కోసం రూ.60.61 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 5వ రోజు కలెక్షన్స్ బాగా తగ్గాయి. వీక్ డేస్ లో కూడా ఇలా కలెక్ట్ చేస్తుందో లేదో చూడాలి.