OG: ‘అఖండ 2’ కే ఎక్కువ ఛాన్సులు.. ‘ఓజి’ కి లైన్ క్లియర్

‘అఖండ 2’ ‘ఓజి’ క్రేజీ ప్రాజెక్టులు. ఇప్పుడొస్తున్న పెద్ద సినిమాల్లో డిస్ట్రిబ్యూటర్స్ ను ఎక్కువగా ఆకర్షిస్తున్న సినిమాలు అని కూడా చెప్పాలి. ఎందుకంటే కోవిడ్ తర్వాత చూసుకుంటే.. స్టార్ హీరోల సినిమాలు ఏవీ కూడా అన్ని ఏరియాల్లోనూ బ్రేక్ ఈవెన్ కాలేదు. మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ ‘గుంటూరు కారం’.. రాంచరణ్.. ఎన్టీఆర్..ల ‘ఆర్.ఆర్.ఆర్’, అల్లు అర్జున్ ‘పుష్ప’ ‘పుష్ప 2’, ప్రభాస్ ‘సలార్’ ‘కల్కి 2898 AD’ వంటి సినిమాలు అన్నీ పాజిటివ్ టాక్ తో కూడా అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ సాధించలేదు.

OG

సీనియర్ స్టార్ హీరోల సినిమాలు మాత్రం అంచనాలను మించి కలెక్ట్ చేశాయి. బాలకృష్ణ ‘అఖండ 2’ ‘వీరసింహారెడ్డి’ ‘భగవంత్ కేసరి’, చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ , వెంకటేష్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలు బయ్యర్స్ కి భారీ లాభాలు అందించాయి. టికెట్ రేట్లు తక్కువగా ఉన్నప్పటికీ ‘భీమ్లా నాయక్’ కూడా బ్రేక్ ఈవెన్ దగ్గర వరకు వెళ్ళి పోరాడింది.

అందుకే భారీ హైప్ కలిగిన పవన్ కళ్యాణ్ ‘ఓజి’ , బాలయ్య ‘అఖండ 2’ సినిమాలకు భారీ డిమాండ్ ఏర్పడింది. కాకపోతే ఈ 2 సినిమాలని సెప్టెంబర్ 25 నే రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇలా చేయడం వల్ల వీటి ఓపెనింగ్స్ కి దెబ్బ పడుతుంది. కానీ ఓటీటీ డీల్స్ వల్ల ఇవి ఆ డేట్ కి వచ్చే అవకాశాలు లేవని తెలుస్తుంది. ఎందుకంటే.. ‘ఓజి’ ని నెట్ ఫ్లిక్స్ సంస్థ తీసుకుంది. 5 వారాల గడువు ఉంది.

అక్టోబర్ చివరికి స్ట్రీమింగ్ చేసేలా అగ్రిమెంట్ అయిపోయింది. కానీ ‘అఖండ 2’ ని ప్రైమ్ సంస్థ తీసుకుంది. సెప్టెంబర్ 25న ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ అయితే అక్టోబర్ ఎండ్ కి ప్రైమ్ లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు లేవు. ఎందుకంటే.. అక్టోబర్ లో ‘కాంతార చాప్టర్ 1’ రిలీజ్ అవుతుంది. అలాగే మరికొన్ని సినిమాలకి కూడా స్లాట్స్ ఇచ్చింది. అందువల్ల ‘అఖండ 2’ నవంబర్ వరకు స్లాట్ లేదు. నవంబర్ అన్ సీజన్ కాబట్టి డిసెంబర్ కి వెళ్లే అవకాశాలే ఎక్కువ. అదీ మేటర్.

 నాగవంశీ చేతుల్లో ‘మిస్టర్ బచ్చన్’ హీరో, హీరోయిన్స్ భవిష్యత్తు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus