ఒక్క హిట్టిచ్చి ఎన్టీఆర్ రుణం తీర్చేసుకోవాలి : హరీష్ శంకర్

ఒకసారి గ్రాఫ్ చూసుకుంటే ‘గబ్బర్ సింగ్’ తర్వాత దర్శకుడు హరీష్ శంకర్ కు ఒక్క హిట్టు కూడా లేదు. ఆ తర్వాత చేసిన ‘రామయ్యా వస్తావయ్యా’ పెద్ద డిజాస్టర్ కాగా.. ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ ‘దువ్వాడ జగన్నాధం- డీజే’ చిత్రాలు యావరేజ్ లు గా మిగిలాయి. ఏదో మాస్ ఎలిమెంట్స్ అలాగే కామెడీ తో లాగించేస్తాడని… ముఖ్యంగా మాస్ ఇమేజ్ కోసం పరితపించే హీరోలు ఈ కుర్ర డైరెక్టర్ కు అవకాశాలు ఇస్తూ వస్తున్నారు. ఇప్పుడు వరుణ్ తేజ్ కూడా హరీష్ డైరెక్షన్లో ‘వాల్మీకి’ చిత్రం చేశాడు. సెప్టెంబర్ 20 న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఈ క్రమంలో ప్రమోషన్స్ లో చురుగ్గా పాల్గొంటున్నాడు దర్శకుడు హరీష్ శంకర్. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ పై హరీష్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.

హరీష్ మాట్లాడుతూ…”నేను ఎంతగానో అభిమానించే యంగ్ హీరోల్లో ఎన్టీఆర్ ఒకరు. ఆయనకి నేను చాలా రుణపడి వున్నాను. ‘రామయ్యా వస్తావయ్యా’ సినిమాతో ఆయన నాకు ఒక మంచి అవకాశం ఇచ్చారు. ఆ సినిమా అంతగా ఆడలేదు .. నాపై ఆయన పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయాను. అప్పటి నుండీ నాలో ఆ బాధ అలాగే ఉండిపోయింది. ఎప్పటికైనా ఆయనతో మరో సినిమా చేయాలి .. హిట్ ఇచ్చేసి రుణం తీర్చుకోవాలి. ఆ రోజు కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నాను” అంటూ చెప్పుకొచ్చాడు.

గ్యాంగ్‌ లీడర్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
పహిల్వాన్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus