ఈ సారి సీటీమార్ అనేది మాస్ మహారాజ్

దువ్వాడ జగన్నాథం (డీజే) లోని ‘సీటీమార్’ సాంగ్ ని రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ అదరగొట్టగా.. అందుకు అల్లు అర్జున్, పూజా హెగ్డేలు తమ స్టెప్పులతో దుమ్ము లేపారు. సినిమాలో ఈ పాట హైలెట్ గా నిలిచింది. ఈ సాంగ్ ని యూట్యూబ్ లో ఎక్కువమంది వీక్షిస్తున్నారు. ఈ విషయాన్నీ గ్రహించిన డైరక్టర్ హరీష్ శంకర్ ఈ పాటలోని పదాన్ని తన నెక్స్ట్ సినిమాకి టైటిల్ గా ఫిక్స్ చేశారు. నిన్ననే ఈ పేరుని ప్రకటించారు. అప్పటి నుంచి సోషల్ మీడియాలో అనేక వార్తలు రూమర్లు కొట్టాయి. ఈ చిత్రంలో హీరోగా అల్లు అర్జున్ నటిస్తారని అతని అభిమానులు వైరల్ చేస్తుండగా.. మరికొంతమంది మాత్రం నేచురల్ స్టార్ ఈ కథలో నటిస్తారని పోస్టులు పెట్టారు.

అయితే వారిద్దరూ కాదని తెలిసింది. “సీటీమార్” సినిమాలో మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటించబోతున్నట్లు ఫిలింనగర్ వాసులు చెప్పారు. ప్రస్తుతం హరీష్ శంకర్ దాగుడుమూతలు సినిమా స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నారు. శర్వానంద్, నితిన్‌ తో సినిమా చేయనున్నారు. దీని తర్వాత సీటీమార్ ని తెరకెక్కించనున్నారు. ఇక రవితేజ విషయానికి వస్తే అతను టచ్ చేసి చూడు సినిమా తర్వాత కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నటిస్తున్నారు. “నేల టికెట్” అని పేరు పరిశీలిస్తున్న ఈ చిత్రం వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. దీని తర్వాత శ్రీను వైట్ల దర్శకత్వంలో రవితేజ మూవీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ రెండు చిత్రాల తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో నటిస్తారు. వీరిద్దరి కలయికలో వచ్చిన మిరపకాయ్ సూపర్ హిట్ అయింది. మళ్ళీ ఈ కాంబో లో రూపుదిద్దుకోనున్న సినిమాపై అంచనాలు భారీస్థాయిలో ఉంటాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus