Danayya, Chiranjeevi: త్రివిక్రమ్, వెంకీ కుడుముల వర్కౌట్ కాలేదు.. ఇప్పుడు హరీష్ శంకర్ కూడా..?!

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ప్రస్తుతం ‘విశ్వంభర’ (Vishwambhara) షూటింగ్లో బిజీగా గడుపుతున్నారు. మల్లిడి వశిష్ట (Mallidi Vasishta) డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ 2025 సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల కాబోతోంది. షూటింగ్ పార్ట్ చాలా వరకు కంప్లీట్ అయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు, వి.ఎఫ్.ఎక్స్ పనులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. ‘విశ్వంభర’ తర్వాత చిరు ఏ దర్శకుడితో సినిమా చేస్తారు అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. మోహన్ రాజా చెప్పిన ఓ కథకి చిరు ఓకే చెప్పారు.

Danayya, Chiranjeevi:

‘గాడ్ ఫాదర్’ (God Father) టైంలో మోహన్ రాజా (Mohan Raja) పనితనానికి చిరు బాగా ఇంప్రెస్ అయిపోయారు. సో అదే నమ్మకంతో.. మోహన్ రాజా దర్శకత్వంలో ఇంకో సినిమా చేయడానికి చిరు సిద్ధమైనట్టు తెలుస్తోంది. కానీ ఈ ప్రాజెక్టు గురించి ఎక్కువ వివరాలు ఏమీ బయటకి రాలేదు. మరోపక్క ‘ఆర్.ఆర్.ఆర్’ (RRR) నిర్మాత డీవీవీ దానయ్యతో  (D. V. V. Danayya) సినిమా చేయడానికి చిరు ఓకే చెప్పి చాలా కాలం అయ్యింది. ముందుగా త్రివిక్రమ్ (Trivikram) దర్శకత్వంలో ఈ ప్రాజెక్టు ఉంటుంది అని స్వయంగా చిరునే లీక్ చేశారు.

అయితే త్రివిక్రమ్ ఇప్పట్లో ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ నుండి బయటకు వచ్చి సినిమా చేసే ఆలోచనలో లేరు. అందుకే చిరు సినిమా వద్దు అని ఆయన అనుకున్నట్టు తెలుస్తుంది. తర్వాత దర్శకుడు వెంకీ కుడుముల (Venky Kudumula) – చిరు- దానయ్య ..ల ప్రాజెక్టు ఉంటుందని ప్రకటన వచ్చింది. కానీ అది కూడా మెటీరియలైజ్ కాలేదు. ఇక ఇప్పుడు హరీష్ శంకర్ (Harish Shankar) తో సినిమా అంటూ ప్రచారం మొదలైంది.

హరీష్ శంకర్ దర్శకత్వంలో సినిమా చేయాలని చిరుకి చాలా ఆశగా ఉంది. కమర్షియల్ సినిమాలని హ్యాండిల్ చేయడంలో హరీష్ సిద్ధహస్తుడు. ఈ క్రమంలో దానయ్య- చిరు- హరీష్ శంకర్ కాంబినేషన్లో మూవీ ఫిక్స్ అయినట్టు ప్రచారం జరుగుతుంది. కానీ ఇందులో నిజం లేదు అనేది ఇన్సైడ్ టాక్. సో అధికారిక ప్రకటన వస్తే తప్ప.. దేనిని నమ్మడానికి లేదు.

తెలియక జరిగిన తప్పును క్షమించండి, నేనూ వెంకటేశ్వరుడి భక్తుడినే.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus