Pushpa: ‘బుక్‌ మై షో’కి ‘డిస్ట్రిక్ట్‌’ దెబ్బేస్తుందా? లేక ‘పుష్ప’రాజ్‌కి షాకిస్తుందా?

  • December 2, 2024 / 11:10 AM IST

‘పుష్ప: ది రూల్‌’ (Pushpa 2: The Rule) సినిమా బుకింగ్స్‌ ఓపెన్‌ చేసి సుమారు ఐదు గంటలు అవుతోంది. మామూలుగా అయితే ఈ టైమ్‌కి ఓపెన్‌ చేసిన టికెట్లు అన్నీ హాట్‌ కేకుల్లా అమ్ముడైపోవాలి. గత కొన్నేళ్లుగా టాలీవుడ్‌లో ఇదే జరుగుతూ వస్తోంది. ఇలా టికెట్లు ఓపెన్‌ చేయగానే అలా ఫ్యాన్స్‌ వాలిపోతారు. టికెట్లు కొనేసి హౌస్‌ఫుల్‌ బోర్డు వర్చువల్‌గా పెట్టేస్తారు. అయితే ‘పుష్ప 2’ విషయంలో ఇది జరగడం లేదు. దీనికి కారణం టీమ్‌ చేసి రిస్కే అని అంటున్నారు.

Pushpa

ఆ రిస్క్‌ పేరే ‘డిస్ట్రిక్ట్‌’. జొమాటో వారి కొత్త టికెట్‌ బుకింగ్‌ యాప్‌. పేటీఎంలోని టికెట్‌ బుకింగ్‌ ఫీచర్‌ను జొమాటో కొనుగోలు చేసి డిస్ట్రిక్ట్‌ పేరుతో తీసుకొచ్చింది. ఇప్పుడు ‘పుష్ప: ది రూల్‌’ టికెట్లు అన్నీ ఇందులోంచే బుక్‌ చేయాలి. రెగ్యులర్‌గా సినిమా టికెట్లు అంటే బుక్‌ మై షోలో కొనుగోలు చేయడం ప్రేక్షకులకు అలవాటు. అందుకే ‘పుష్ప: ది రూల్‌’ టికెట్ల బుకింగ్‌ ఓపెన్‌ అయింది అనగానే అందరూ బీఎంఎస్‌లోకే వెళ్లారు. అక్కడ కూడా ఇంకా ఎలాంటి సమాచారం లేదు.

దీంతో ఏంటా విషయం అని చూస్తే ‘పుష్ప: ది రూల్‌’ టికెట్ల బుకింగ్‌కు తెలుగు రాష్ట్రాల్లో అధికారిక పార్ట్‌నర్‌ డిస్ట్రిక్ట్‌ అట. అందులో మాత్రమే టికెట్లు ప్రస్తుతానికి అందుబాటులో ఉన్నాయి. ఈ విషయం తెలియనివాళ్లు ఇంకా బీఎంఎస్‌, జస్ట్‌ టికెట్‌ అంటూ అక్కడే చూస్తున్నారు. దీంతో డిస్ట్రిక్ట్‌లో టికెట్లు ఇంకా అందుబాటులో ఉన్నాయి. మామూలుగా అయితే ఇది పెద్ద విషయం కాదు. థియేటర్ల సీట్‌ మ్యాప్‌లను షేర్‌ చేస్తూ సినిమా మీద హైప్‌ తీసుకొస్తున్న ఈ రోజుల్లో ఖాళీ సీట్లు సినిమాకు నష్టం చేకూరుస్తాయి.

డిసెంబరు 5న టికెట్ల విషయంలో బుకింగ్‌ కాస్త బాగున్నా.. డిసెంబరు 6, 7, 8 తేదీల్లో బుకింగ్ మాత్రం చాలా మందకొడిగా సాగుతోంది. దానికి డిస్ట్రిక్ట్‌తో డీల్‌ ఒక కారణమైతే, టికెట్‌ ధరలు మరో కారణం అని చెప్పాలి. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని వాడుకుని సినిమా టీమ్‌ భారీగా రేట్లు పెంచింది. దీంతో బుక్‌ మై షోకి దెబ్బేసే ఆలోచనలో ముందుకొచ్చిన డిస్ట్రిక్ట్.. ఇప్పుడు ‘పుష్ప’రాజ్‌కి దెబ్బేసేలా ఉందనే టాక్‌ నడుస్తోంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus