NTR30: వైరల్ అవుతున్న హ్యాష్ ట్యాగ్.. సమాధానం ఉందా?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబో సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడగా ఈ సినిమాకు సంబంధించి తారక్ పుట్టినరోజు తర్వాత ఎలాంటి అప్ డేట్ రాలేదనే సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ ఫ్యాన్స్ దసరా, దీపావళి పండుగల సమయంలో ఈ సినిమా నుంచి ఏదైనా అప్ డేట్ ఉంటుందని భావించగా నిరాశే ఎదురైంది. అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ సినిమాకు సంబంధించి అప్ డేట్ ఇవ్వాలని సోషల్ మీడియా వేదికగా #WeDemandNTR30Update హ్యాష్ ట్యాగ్ ను వైరల్ చేస్తున్నారు.

ఎన్టీఆర్ అభిమానులు మాకు అప్ డేట్ కావాలంటూ కూల్ గానే సోషల్ మీడియాలో రచ్చ చేయడం గమనార్హం. చిన్న అప్ డేట్ ఇస్తే కూల్ అవుతామని ఫ్యాన్స్ చెబుతుండగా మేకర్స్ ఏం చేస్తారో చూడాల్సి ఉంది. వైరల్ అవుతున్న హ్యాష్ ట్యాగ్ గురించి మేకర్స్ ఎలా స్పందిస్తారో చూడాలి. గతంలో ప్రభాస్ అభిమానులు సైతం అప్ డేట్ కోసం ఇదే విధంగా వ్యవహరించారనే సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ 30 షూటింగ్ వేగంగా పూర్తైతే ఎన్టీఆర్31 మూవీ షూట్ మొదలయ్యే ఛాన్స్ అయితే ఉంది.

ఎన్టీఆర్31 ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. తను నటించే ప్రతి ప్రాజెక్ట్ సక్సెస్ సాధించాలనే ఆలోచనతో ఎన్టీఆర్ కెరీర్ విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. తారక్ అభిమానులు తారక్ తర్వాత ప్రాజెక్ట్ లతో కెరీర్ బెస్ట్ హిట్లు సొంతం చేసుకోవాలని భావిస్తున్నారు. ఒక్కో సినిమాకు 70 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్న తారక్ కెరీర్ విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు.

రాజమౌళి డైరెక్షన్ లో నటించిన హీరో తర్వాత సినిమా ఫ్లాప్ అవుతుందని ఇండస్ట్రీలో సెంటిమెంట్ ఉన్న నేపథ్యంలో ఆ సెంటిమెంట్ ను కచ్చితంగా బ్రేక్ చేసే దిశగా తారక్ అడుగులు వేస్తుండటం గమనార్హం. సినిమాసినిమాకు జూనియర్ ఎన్టీఆర్ రేంజ్ పెరుగుతోంది.

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus