‘బండ్లు ఓడలవుతుంటాయి, ఓడలు బండ్లవుతాయి’ అని చిన్నప్పుడు ఎవరైనా చెబితే బండి ఓడగా ఎలా మారుతుంది అని కన్ఫ్యూజ్ అయ్యేవాళ్లం. అందుకు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ప్రస్తుతం ప్రముఖ సి.కళ్యాణ్ పరిస్థితి. సంక్రాంతికి బాలయ్యతో “జై సింహా”తో హిట్ కొట్టి ఓ మోస్తరుగా లాభాలు సంపాదించుకొన్న సి.కళ్యాణ్ గతవారం విడుదలైన “ఇంటిలిజెంట్”తో ఆ సినిమాతో వచ్చిన లాభాలతోపాటు భారీ స్థాయిలో నష్టపోయినట్లు తెలుస్తోంది. పైకి చెప్పుకోవడం లేదు కానీ “ఇంటిలిజెంట్” పుణ్యమా అని సి.కళ్యాణ్ దాదాపుగా 15 కోట్లు నష్టపోయారట.
సాయిధరమ్ తేజ్ – లావణ్య త్రిపాటి జంటగా వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం కనీస స్థాయిలో కూడా ఆడియన్స్ ను ఆకట్టుకోలేకపోయింది.
ముఖ్యంగా రైటర్ ఆకుల శివ రాసిన స్టోరీతోపాటు, సెకండ్ విలన్ గా అతడి పెర్ఫార్మెన్స్ కూడా ఆడియన్స్ ను బాగా చిరాకు పెట్టింది. పాపం అసలే వరుసగా నాలుగు ఫ్లాప్స్ తో బాధపడుతున్న తేజ్ కి “ఇంటిలిజెంట్” అయిదో ఫ్లాప్ గా నిలవడం ఇంకాస్త బాధించింది. కానీ.. అందరికంటే ఎక్కువగా బాధపడింది మాత్రం నిర్మాత సి.కళ్యాణ్, ఎందుకంటే కొంత గ్యాప్ తీసుకొని ప్రొడ్యూసర్ గా మళ్ళీ నిలదొక్కుకుందామని ప్రయత్నిస్తున్న తరుణంలో ఈస్థాయి ఫ్లాప్ రావడం అనేది చాలా పెద్ద మైనస్. ఇక ఇప్పుడు చేసేది కూడా ఏమీ లేక.. సైలెంట్ గా తన తదుపరి చిత్రమైన “1945” మీద ధ్యాస పెట్టాడు సి.కళ్యాణ్. రాణా కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంపై మంచి అంచనాలున్నాయి.