అంత పెట్టి సినిమా టికెట్లు కొంటారా..?

  • February 11, 2021 / 04:13 PM IST

లాక్ డౌన్ అనంతరం థియేటర్లు తెరుచుకున్న తరువాత సినిమా టిక్కెట్ రేట్లు పెంచుకోవచ్చని తెలంగాణ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. అయితే సంక్రాంతికి వచ్చిన సినిమాలేవీ కూడా రేట్లు పెంచే సాహసం చేయలేదు. ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం కష్టమవుతున్న సమయంలో టిక్కెట్ రేటు పెంచే రిస్క్ చేయలేకపోయారు. అయితే.. శుక్రవారం నాడు విడుదల కాబోతున్న ‘ఉప్పెన’ సినిమాకి మాత్రం టిక్కెట్ రేట్లు పెంచేశారు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించిన ‘ఉప్పెన’ సినిమాలో వైష్ణవ్ తేజ్ హీరోగా నటించగా..

విజయ్ సేతుపతి విలన్ గా నటించారు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పుడు దానిని క్యాష్ చేసుకునే పనిలో పడింది నిర్మాణ సంస్థ. ఐమాక్స్ లో ‘ఉప్పెన’ టిక్కెట్ రేటు 350 రూపాయలకు చేరింది. మిగిలిన మల్టీప్లెక్స్ లలో 200 నుండి 250 రూపాయల వరకు ఉంది. సింగిల్ స్క్రీన్ లలో 150 రూపాయలకు టిక్కెట్ రేట్ ఫిక్స్ చేశారు. ‘బాహుబలి’ లాంటి భారీ బడ్జెట్ సినిమాలు వచ్చినప్పుడు టిక్కెట్ రేటు పెంచడంలో తప్పు లేదని..

కానీ ‘ఉప్పెన’ లాంటి సినిమాలకు సైతం టిక్కెట్ రేట్లు పెంచడం ఏంటంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. నిజానికి ఈ సినిమా కోసం అనుకున్న బడ్జెట్ కాస్త పెరిగిపోయింది. దాదాపు రూ.30 కోట్ల వరకు చేరింది. దాన్ని రాబట్టుకోవడానికి ఇలా టిక్కెట్ రేట్లు పెంచేశారని అర్ధమవుతోంది. మైత్రి మూవీ మేకర్స్ స్వయంగా ఈ సినిమాను విడుదల చేసుకుంటుంది. అందుకే రిస్క్ తీసుకొని టిక్కెట్ రేటు పెంచేసింది. అయితే తొలి మూడు రోజులు మాత్రమే ఈ రేటు ఉండొచ్చని సమాచారం.

Most Recommended Video

వామ్మో.. సుమంత్ ఇన్ని హిట్ సినిమాలను మిస్ చేసుకున్నాడా..!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
ఈ 10 మంది బుల్లితెర సెలబ్రిటీలు 30 ఏళ్ళ వయసొచ్చినా పెళ్లి చేసుకోలేదట..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus