హెబ్బా పటేల్, అరుణ్ అదిత్ ’24 కిస్సెస్’ ఫస్ట్ లుక్

హెబ్బా పటేల్, అరుణ్ అదిత్ జంటగా నటించిన ’24 కిస్సెస్’ సినిమా ఫస్ట్ లుక్ ఇంటర్నేషనల్ కిస్సింగ్ డే (జులై 6) సందర్బంగా విడుదల చేసారు. ఈ చిత్ర టీజర్ రేపు విడుదల చెయ్యబోతున్నారు. ‘మిణుగురులు’ చిత్ర దర్శకుడు అయోధ్యకుమార్ కృష్ణంశెట్టి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ‘మిణుగురులు’ చిత్రం విమర్శకుల ప్రసంశలు పొందడమే కాకుండా పలు అవార్డ్స్ సొంతం చేసుకుంది.

“నీకో సగం నాకో సగం ఈ ఉత్సవం” ట్యాగ్ లైన్ తో ఉన్న ఈ పోస్టర్ అంచనాలను పెంచింది. కొత్త కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా యువతను అలరించబోతోంది. సిల్లీమొంక్స్ ఎంటర్టైన్మెంట్స్, రెస్పెక్ట్ క్రియేషన్స్ బ్యానర్స్ ’24 కిస్సెస్’ సినిమాను నిర్మించాయి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus