Hebah Patel: చేతులు కాలాక ఆకులు పట్టుకుంటున్న హెబ్బా..?

కుమారి 21ఎఫ్ సినిమాలో హీరోయిన్ గా నటించి ఓవర్ నైట్ లో మిడిల్ రేంజ్ హీరోయిన్ గా హెబ్బా పటేల్ ఎదిగారు. తొలి సినిమాతోనే యువతలో భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్న హెబ్బా పటేల్ స్టార్ హీరోయిన్ అవుతుందని ఫ్యాన్స్ భావించగా ఆమె మాత్రం స్టార్ హీరోయిన్ స్టేటస్ ను సొంతం చేసుకోలేకపోయారు. సినిమాల ఎంపికలో చేసిన తప్పులు, గెస్ట్ రోల్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, స్పెషల్ సాంగ్స్ చేయడం హెబ్బా కెరీర్ కు మైనస్ గా మారాయి.

హెబ్బా నటించిన సినిమాలలో ఎక్కువ సినిమాలు సక్సెస్ కాకపోవడంతో ఆమె చిన్న హీరోల సినిమాలకే పరిమితం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాజాగా హెబ్బా పటేల్ మాట్లాడుతూ తాను సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చే సమయానికి ఇక్కడి విషయాలు తనకు తెలియవని ఆమె అన్నారు. 24 కిస్సెస్ మూవీ తర్వాత గెస్ట్ రోల్స్, స్పెషల్ సాంగ్స్ లో మాత్రమే కనిపించానని ఒకానొక సమయంలో కెరీర్ విషయంలో తనకు భయమేసిందని చెప్పుకొచ్చారు.

తాను ఇన్నాళ్లకు మారానని కథ, పాత్ర నచ్చితే మాత్రమే సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తానని హెబ్బా పటేల్ తెలిపారు. అయితే హెబ్బా పటేల్ మాటలు విన్న నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. హెబ్బా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఇన్ని సంవత్సరాల తర్వాత కథల, పాత్రల ఎంపిక విషయంలో మారినా ఆమె కెరీర్ కు పెద్దగా ప్రయోజనం చేకూరదని చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే లాభం ఏమిటని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కెరీర్ విషయంలో తప్పటడుగులు వేసిన హెబ్బా కొత్త సినిమాలను ప్రేక్షకులు పట్టించుకుంటారో లేదో చూడాల్సి ఉంది.

Most Recommended Video

బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus