మెగాస్టార్ చిరంజీవి 151 వ చిత్రంగా ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి’ జీవిత ఆధారంగా తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘సైరా నరసింహా రెడ్డి’. సురేంద్ర రెడ్డి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని 285 కోట్ల భారీ బడ్జెట్ తో రాంచరణ్ నిర్మించాడు. అక్టోబర్ 2న తెలుగుతో పాటు హిందీ, తమిళ , మలయాళ, కన్నడ భాషల్లో అత్యంత భారీ స్థాయిలో విడుదల కాబోతుంది. ఇక ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు తాజాగా పూర్తయ్యాయి. ఈ చిత్రాన్ని యూ/ఎ సర్టిఫికేట్ ను జారీ చేసారు సెన్సార్ బోర్డు వారు. ఇక ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాలకు సెన్సార్ బోర్డు వారు అడ్డు కత్తెర వేశారు. అవేంటో చూద్దాం రండి.
1) ఎప్పటిలాగే మధ్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం’ (బ్యాక్ గ్రౌండ్ వాయిస్ తో)
2) బా*** ర్డ్ అనే పదాన్ని మ్యూట్ చేసారు
3) ‘తొలి యుధ్ధం’ అనే పదంలో ‘తొలి’ ని మ్యూట్ చేసారు.
4)’arse’ పదాన్ని మ్యూట్ చేసారు అలాగే ‘సబ్ టైటిల్స్’ లో కూడా తొలగించారు.
5) లం**ల అనే పదాన్ని కూడా మ్యూట్ చేసారు.
6)fu**k o*f, fu*k అనే పదాల్ని మ్యూట్ చేసారు. మొత్తంగా 170.50 నిమిషాల రన్ టైములో 52 సెకండ్ల రన్ టైం తగ్గించారు.
ఇప్పుడు ‘సైరా’ రన్ టైం 169.58 నిముషాలు.