Jr NTR: ఎన్టీఆర్ షోలో..కోటి కోసం రాజా రవీంద్రఎదుర్కొన్న ప్రశ్నలు ఇవే..!

  • November 19, 2021 / 05:52 PM IST

ఎన్టీఆర్ ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షోలో కోటి రూపాయలు గెలుచుకున్న ‘రాజా రవీంద్ర’ రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగా పాపులర్ అయిపోయాడు. వరుసగా ఇతను ఇంటర్వ్యూలు కూడా ఇచ్చేస్తున్నాడు. ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ సిరీస్ లో కోటి రూపాయలు గెలిచిన మొదటి వ్యక్తిగా చరిత్ర సృష్టించిన రాజా రవీంద్రకి ట్యాక్సులు పోను మిగిలేది రూ.62 లక్షలే అయినప్పటికీ… ఆ ప్రైజ్ మనీని సోషల్ సర్వీస్ కోసం ఉపయోగిస్తాను అంటూ అతను చెప్పడంతో సోషల్ మీడియాలో అతని పై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం కు చెందిన ఎస్.ఐ.రాజా రవీంద్ర హాట్ సీట్ కు రావడం దగ్గర నుండీ కోటి గెలుపొందే వరకు షోలో అతను ఎదుర్కొన్న 15 ప్రశ్నలను ఓ లుక్కేద్దాం రండి :

ముందుగా ఫాస్టెస్ట్‌ ఫింగర్‌ ఫస్ట్‌..

హాట్‌ సీట్‌లోకి రావడానికి రాజా రవీంద్ర ఎదుర్కొన్న ప్రశ్న :

హైదరాబాద్‌ నుంచి వాటి దూరాల ప్రకారం, ఈ నగరాలను తక్కువ నుంచి ఎక్కువకు అమర్చండి?

a) న్యూయార్క్‌
b) ముంబయి
c) దుబాయి
d) విజయవాడ

జవాబు: D, B, C, A

దీనికి కేవలం 2.63 సెకన్లలోనే సమాధానం చెప్పి హాట్‌ సీట్‌ పైకి వచ్చాడు రాజా రవీంద్ర.

అటు తర్వాత :

1000 రూపాయల ప్రశ్న

1) సాధారణంగా, వీటిలో దేని మీద చెల్లుబాటు తేదీ ముద్రించి ఉండదు?

a) ఆధార్ కార్డు
b) పాస్‌పోర్టు
c) డెబిట్ కార్డు
d) డ్రైవింగ్ లైసెన్స్

జవాబు: ఆధార్ కార్డు

2000 రూపాయల ప్రశ్న

2) ఈ విగ్రహంలో కనిపిస్తున్న వారిని గుర్తించండి

a) మహావీర
b) బాహుబలి
c) బుద్దుడు
d) గురునానక్

జవాబు: బుద్దుడు

3000 రూపాయల ప్రశ్న

3) వీటిలో, కత్తిసాము, సిలంబం, మరియు కలరిపయట్టు అనేవి దేనికి ఉదాహరణలు..?

a) నృత్యం
b) సంగీతం
c) చిత్రలేఖనం
d) మార్షల్ ఆర్ట్స్

జవాబు: మార్షల్ ఆర్ట్స్

5000 రూపాయల ప్రశ్న

4) భారతదేశం కన్నా ఎక్కువ జనాభా ఉన్న దేశాలు ఎన్ని…?

a) ఒకటి
b) రెండు
c) మూడు
d) నాలుగు

జవాబు: ఒకటి

10000 రూపాయల ప్రశ్న

5) 2019లో భారత హోంశాఖామాత్యులుగా బాధ్యతలు చేపట్టిన వారు ఎవరు..?

a) నిర్మలా సీతారామన్
b) నితిన్ గడ్కరీ
c) రవిశంకర్ ప్రసాద్
d) అమిత్ షా

జవాబు: అమిత్ షా

20000 రూపాయల ప్రశ్న

6) రేడియో ప్రసారాలలోని AM మరియు FMలో M దేనిని సూచిస్తుంది..?

a) మీటర్
b) మాడ్యులేషన్
c) మాగ్నిట్యూడ్
d) మిషన్

జవాబు: మాడ్యులేషన్

40000 రూపాయల ప్రశ్న

7) ఏ మానవ అవయవాలలో, ఐరిస్, లెన్స్, మరియు రెటీనా ఉంటాయి..?

a) ఊపిరితిత్తులు
b) చెవులు
c) కళ్లు
d) కడుపు

జవాబు: కళ్లు

80000 రూపాయల ప్రశ్న

8) వీటిలో, ఆంధ్రప్రదేశ్‌లోని అంతర్వేది వద్ద బంగాళాఖాతంలో కలిసే నది ఏది..?

a) కృష్ణ
b) తుంగభద్ర
c) పెన్నా
d) గోదావరి

జవాబు: గోదావరి

160000 రూపాయల ప్రశ్న

9) హిందూ పురాణాలలో, వీరిలో కర్ణుడి గురువు ఎవరు..?

a) వ్యాసుడు
b) పరుశురాముడు
c) పాండురాజు
d) కృష్ణుడు

జవాబు: పరుశురాముడు

320000 రూపాయల ప్రశ్న

10) ఆగస్టు 2021లో, అపరేషన్ దేవీశక్తిలో భాగంగా ఏ ప్రాంతం నుంచి భారత ప్రభుత్వం 800 పైచిలుకు జనాన్ని తరలించింది..?

a) అఫ్ఘనిస్థాన్
b) ఇరాక్
c) సిరియా
d) మయన్మార్

జవాబు: అఫ్ఘనిస్థాన్

640000 రూపాయల ప్రశ్న

11) భారత స్వాతంత్య్రం పొందినప్పుడు బ్రిటీష్ వైస్రాయ్ ఉన్నది ఎవరు…?

a) లార్డ్ వేవెల్
b) లార్డ్ మౌంట్ బాటెన్
c) లార్డ్ ఎల్గిన్
d) లార్డ్ రిప్పన్

జవాబు: లార్డ్ మౌంట్ బాటెన్

1250000 రూపాయల ప్రశ్న

12) ఒకే పారాఒలింపిక్స్‌లో బహుళ పతకాలు సాధించిన మొదటి భారత మహిళ ఎవరు..?

a) అవనీ లేఖరా
b) దీపా మాలిక్
c) అంజలీ భగవత్
d) భవీనా పటేల్

జవాబు: అవనీ లేఖరా

2500000 రూపాయల ప్రశ్న

13) 2020లో ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన ఏ పదం, ఇటాలియన్ భాషలో 40 రోజులు అని అర్దం వచ్చే ఒక పదం నుంచి వచ్చింది..?

a) లాక్‌డౌన్
b) ఐసోలేషన్
c) క్వారంటైన్
d) పాండమిక్

జవాబు: క్వారంటైన్

5000000 రూపాయల ప్రశ్న

14) జాతీయ వైద్యుల దినోత్సవం ఏ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, వైద్యుడు అయిన ఒక వ్యక్తి జాపకార్తం జరుపుతారు..?

a) మిజోరాం
b) పశ్చిమ బెంగాల్
c) ఉత్తర ప్రదేశ్
d) కేరళ

జవాబు: పశ్చిమ బెంగాల్

కోటి రూపాయల ప్రశ్న:

15) 1656 రాష్ట్రాల పునర్విభజన చట్టం ద్వారా ఆంధ్రప్రదేశ్ అవతరణకు కారణమైన కమీషన్‌కు ఎవరు అధ్యక్షత వహించారు..?

a) రంగనాథ్ మిశ్రా
b) రంజిత్ సింగ్ సర్కారియా
c) బీపీ మండల్
d) ఎస్ ఫజల్ ఆలీ

జవాబు: ఎస్ ఫజల్ ఆలీ.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus