Kalki 2898 AD: ‘బుజ్జి’ ఎక్కడ తయారైంది? ఖర్చెంత? ఆసక్తికర వివరాలు మీ కోసం..

ఇండియన్‌ సినిమాలో, ఆటోమోటార్స్‌ ఇండస్ట్రీలో వైరల్‌గా మారిన పేరు ‘బుజ్జి’.‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) సినిమాలో స్పెషల్‌ సూపర్‌ పవర్స్‌ ఉన్న కారును చూపించబోతున్నారు. దాని పరిచయం ఇప్పుడు వైరల్‌గా మారింది. ఇటీవల ఓ ఈవెంట్‌ పెట్టి మరీ టీమ్‌ ‘బుజ్జి’ని అందరికీ పరిచయం చేసింది. ఆ ఈవెంట్‌ నేపథ్యంలో కారును ప్రత్యేకంగా కొన్ని అంతర్జాతీయ, జాతీయ మీడియా సంస్థలకు పరిచయం చేశారు. ఈ క్రమంలో కారు ప్రత్యేకతలు, స్పెసిఫికేషన్లను వివరిస్తూ వాళ్లు వీడియోలు చేశారు.

అవి ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. బుజ్జిని ప్రముఖ ఆటోమొబైల్ సంస్థలు మహీంద్రా, జాయోమ్ ఆటోమోటివ్ సంస్థలు కలసి రూపొందించాయి. సుమారు ఆరు టన్నుల బరువు ఉన్న ఈ బుజ్జిని తమిళనాడులోని కోయంబత్తూరులో తయారు చేశారు. ఈ సూపర్‌ కారు కోసం సుమారు రూ.7 కోట్లు వెచ్చించారట. కారు ముందువైపు రెండు, వెనుక భాగంలో ఒక టైరు మాత్రమే ఉంటాయి. టైర్లు పొడవు 6,075 మి.మీ., వెడల్పు 3,380 మి.మీ., ఇక ఎత్తు 2,186 మి.మీ. రిమ్ సైజ్ 34.5 అంగుళాలు.

ఇక ఈ కారు పవర్ 94 Kw కాగా.. బ్యాటరీ 47 KWH. ఈ కారుకు ప్రముఖ కథానాయిక కీర్తి సురేష్ (Keerthy Suresh) వాయిస్ ఓవర్ ఇచ్చింది. ఇప్పటికే వచ్చిన బుజ్జి టీజర్‌లో ఆమె వాయిస్‌, భైరవ అలియాస్‌ ప్రభాస్‌తో (Prabhas)  ఆమె కెమిస్ట్రీ అదిరిపోయాయి. ఇక ఈ సినిమాను జూన్‌ 27న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌ చేయాలని టీమ్‌ ప్లాన్‌ చేసింది.

ఇప్పటికే ప్రచార కార్యక్రమాలు షురూ చేసినా.. జూన్‌ 4 తర్వాత మరింత జోరుగా ప్రమోషన్స్‌ చేస్తారట. సార్వత్రిక ఎన్నికల ఫలితలు వచ్చాక.. పొలిటికల్‌ ఫీవర్‌ తగ్గాక సినిమా ప్రచార జోరు పెంచాలనేది టీమ్‌ ప్లాన్‌ అట. చూద్దాం ఏ రేంజిలో ఆ ప్రచారం ఉండబోతోందో!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus