Rajamouli: రాజమౌళి గురించి చిరు గోల్డెన్ వర్డ్స్‌ విన్నారా?

రాజమౌళి గురించి ఎంతోమంది గొప్పగా ఎంతో గొప్పగా చెప్పారు.. మీరు వినే ఉంటారు కూడా. ఆయన తీసిన సినిమాలు చూసి అలా పొగిడి ఉండొచ్చు. అయితే రాజమౌళి ఎందుకు అంత గొప్ప దర్శకుడు అయ్యారు అని చిరంజీవి తనదైన శైలిలో చెప్పుకొచ్చారు. అది వింటే రాజమౌళి గురించి చిరంజీవి ఎంతగా ఫాలో అయ్యారు అనేది తెలుస్తుంది. అలాగే ఆయన గురించి ఈ యాంగిల్‌లో మనం ఆలోచించలేదా అని కూడా అనిపిస్తుంది.

‘ఆచార్య’ సినిమా ప్రచారంలో భాగంగా ఇటీవల చిరంజీవి… యువ దర్శకులతో మాట్లాడారు. దర్శకులు ఎలా ఉండాలి, ఎలా పని చేయాలి, ఎలా కెరీర్‌ను మలచుకోవాలి అనే విషయాలు చెబుతూ వచ్చారు. ఈ క్రమంలో రాజమౌళి ప్రస్తావన వచ్చింది. ఆయన అందరి లాంటి వ్యక్తే అయినా.. అంత గొప్ప దర్శకుడు ఎలా అయ్యారో తెలుసా అంటూ చిరంజీవి ఆసక్తికర విశ్లేషణ చెప్పుకొచ్చారు. అందరి దర్శకుల్లాగా రాజమౌళి ఆలోచిస్తారు, సినిమాలు తీస్తారు…కానీ రాజమౌళి విషయంలో ఓ తేడా ఉంది.

అదే ఆయన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది. మనం ఇంటికి వెళ్లాక కుటుంబ సభ్యులతో ఆహ్లాదంగా గడుపుతాం. కానీ రాజమౌళికి ఆ ఛాన్స్‌ లేదు. ఇంటికెళ్తే నాన్న సినిమా, భార్య సినిమా, కొడుకు సినిమా, బాబాయి సినిమా, పెదనాన్న సినిమా.. ఇలా మొత్తంగా సినిమా వాతావరణమే ఉంటుంది. అలాంటి వాళ్ల మధ్య సినిమా గురించి ఆలోచిస్తూ.. సినిమానే తింటూ, సినిమానే పీలుస్తూ ఉంటున్నారు రాజమౌళి. దీంతో ఆయన జీవితంలో ప్రతి నిమిషం సినిమానే అయిపోయింది. తప్పనిసరి పరిస్థితిగా ఆయనకు సినిమా అయిపోయింది. అందుకే ఆయన సినిమాలు ఆ స్థాయికి ఉన్నాయి అని చెప్పారు చిరంజీవి.

దీంతోపాటు దర్శకులు ఎలా ఉండాలో కూడా చెప్పారు. అయితే దీన్ని సలహాగా కాకుండా… మాటగా తీసుకోవాలి అని చెప్పారు. నిరంతర కష్టం మాత్రమే వ్యక్తిని పైకి తీసుకెళ్లే వాహనం అని చెప్పారు. కాస్త డబ్బులు రాగానే కారు కొనాలి, ఇల్లు కొనాలి అని అనుకుంటే డైవర్ట్‌ అవుతున్నట్లే. అలాంటివాటిపై ఫోకస్‌ చేయకుండా నెక్స్ట్‌ సినిమా ఏంటి? అనేది ఆలోచించుకోవాలి అని సూచించారు చిరంజీవి. ప్రలోభాలకు లోనవకుండా.. ముందుకెళ్తేనే విజయం అని చెప్పారు చిరు.

ఆచార్య సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

కన్మణి రాంబో కటీజా సినిమా రివ్యూ & రేటింగ్!
వీళ్ళు సరిగ్గా శ్రద్ద పెడితే… బాలీవుడ్ స్టార్లకు వణుకు పుట్టడం ఖాయం..!
కే.జి.ఎఫ్ హీరో యష్ గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus