Matka: చిన్న కథ రాస్తా అనుకుని.. సినిమా తీసేశారట.. ‘మట్కా’ బ్యాక్‌ స్టోరీ ఇదీ!

మట్కా అనే జూదం ఆధారంగా ‘మట్కా’ (Matka)  సినిమా రూపొందింద అనే విషయం మీకు తెలిసిందే. సినిమా టీమ్‌ చాలా రోజులుగా ఇదే మాట చెబుతోంది కూడా. మొన్నీ మధ్య జూదంలో కింగ్‌ అని ఒకప్పుడు పిలుచుకునే రతన్‌ ఖత్రీ జీవితంలో కొన్ని అంశాల ఆధారంగా సినిమాను తెరకెక్కించామని టీమ్‌ కూడా చెప్పింది. అయితే ఇప్పుడు ఈ సినిమా బ్యాక్‌ స్టోరీ గురించి కరుణ కుమార్‌ (Karuna Kumar)  మాట్లాడారు. సినిమా కథ ఆలోచన ఎలా పుట్టిందో చెప్పుకొచ్చారు.

Matka

కరుణ కుమార్‌ ఓ పెళ్లి వేడుకలో మట్కా అనే జూదం గురించి విన్నారట. ఆ మాటల సందర్భంలోనే విశాఖపట్నంలో ఒకప్పుడు నైట్‌ క్లబ్‌లు, క్యాబరేలు ఉండేవని తెలుసుకున్నారట. దాంతో మట్కా ఆట ఎవరిది అని పరిశోధించడం మొదలుపెట్టారట. తెలుసుకున్న కొంత సమాచారంతో ‘వాడిపోయిన పువ్వులు’ అనే పేరుతో ఓ చిన్న కథని రాయాలనుకున్నారట. అప్పుడే ఈ ఆలోచనను సినిమా చేయాలని అనిపించిందట.

మరి మీరు స్ఫూర్తిగా తీసుకున్న మట్కా కింగ్‌ రతన్‌ఖత్రి జీవితం ఇందులో ఉంటుందా అని అడిగితే.. ఆయన కథను వెబ్‌ సిరీస్‌గా తీస్తున్నారని.. నిజానికి జీవితం అంటే వెబ్‌ సిరీస్‌గానే తీయాలి అని, సినిమాకి అది నప్పదు అని చెప్పారు. ఇక సినిమా సంగతి చూస్తే.. ఇది బర్మా నుండి విశాఖపట్నానికి శరణార్థిగా వచ్చిన వాసు అనే కుర్రాడి కథ ఇది. సెల్‌ఫోన్‌ లేని రోజుల్లో దేశం మొత్తానికి ఒక నంబర్‌ని ఎలా పంపించారు అనేది సినిమాలో చూపిస్తాం అని చెప్పారాయన.

ఇంకా చెప్పాలంటే తానే రతన్‌ ఖత్రి అయితే ఏం చేసేవాడిని అనేది ఆలోచించి రాసిన స్క్రిప్ట్‌ ఇది అని చెప్పారు. ఈ సినిమాలో వరుణ్‌ తేజ్‌  (Varun Tej)  అత్యుత్తమ నటనని చూస్తారని చెప్పిన కరుణ కుమార్‌.. వరుణ్‌ గెటప్‌ల విషయంలో చిరంజీవి స్ఫూర్తి అని చెప్పారు. ఆ లెక్కేంటో తేలాలంటే ఒక్క రోజు ఆగితే సరిపోతుంది. రేపేగా ‘మట్కా’ వాసు థియేటర్లలోకి వచ్చేది.

 ‘జీబ్రా’ కచ్చితంగా పెద్ద హిట్ అవుతుంది: చిరంజీవి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus