Devara: దేవర సీక్వెల్ విషయంలో తారక్ నిర్ణయమిదే.. షూట్ అప్పుడేనా?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్(Jr NTR)   కొరటాల శివ (Koratala Siva)  కాంబో మూవీ దేవర (Devara) బాక్సాఫీస్ ను మరికొన్ని రోజుల్లో షేక్ చేయడం పక్కా అని తేలిపోయింది. దేవర సినిమా ఒకింత భారీ అంచనాలతో తెరకెక్కగా దేవర సీక్వెల్ షూట్ ఎప్పటినుంచి మొదలవుతుందనే చర్చ ప్రేక్షకుల్లో జరుగుతోంది. అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) మూవీ షూట్ పూర్తైన వెంటనే ఈ సినిమా పట్టాలెక్కనుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

Devara

దేవర2 షూట్ 2026 సమ్మర్ లో మొదలయ్యే ఛాన్స్ అయితే ఉంది. దేవర రిజల్ట్ ఆధారంగా దేవర సీక్వెల్ బడ్జెట్, బిజినెస్ డిసైడ్ కానున్నాయని చెప్పవచ్చు. దేవర1 క్లైమాక్స్ ను ఏ విధంగా ముగిస్తారనే చర్చ సైతం జరుగుతోంది. సినిమాలో ఊహించని సర్ప్రైజ్ లు ఉంటాయని ఇంటర్వెల్ సీన్ మాత్రం అదిరిపోతుందని తెలుస్తోంది. దేవరలో తండ్రీ కొడుకుల పాత్రల్లో మాత్రమే కనిపిస్తానని తారక్ పేర్కొన్నారు.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ చాలా కాలం తర్వాత నటించిన ఫుల్ లెంగ్త్ యాక్షన్ మూవీ కావడంతో ఈ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. ఈ నెల 22వ తేదీన జరుగుతున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తారక్, రాజమౌళి ఏం మాట్లాడతారనే చర్చ సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది. దేవర సినిమాలో యాక్షన్ కు ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుందని తారక్ ఇప్పటికే చెప్పకనే చెప్పేశారు.

దేవర సెకండ్ ట్రైలర్ అభిమానులను ఏ రేంజ్ లో మెప్పిస్తుందో చూడాల్సి ఉంది. దేవర ఫస్ట్ డే కలెక్షన్లు ఏ రేంజ్ లో ఉండనున్నాయో అనే చర్చ సైతం సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది. దేవర సినిమా రిజల్ట్ విషయంలో కొరటాల శివ సైతం కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. ఈ సినిమా డైలాగ్స్ విషయంలో సైతం మేకర్స్ ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారని సమాచారం అందుతోంది.

‘దేవర’ కోసం తమ కష్టాన్ని చెప్పిన స్టార్‌ సినిమాటోగ్రాఫర్‌.. అన్ని రోజులు.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus