Jailer Movie: ‘జైలర్‌’ పుకార్లపై కాస్త క్లారిటీ… కలిపారు కానీ డిఫరెంట్‌గా అంట!

  • August 7, 2023 / 06:32 PM IST

సినిమా పోస్టర్‌ చూసి, టీజర్‌ చూసి, ట్రైలర్‌ చూసి.. ఇదేదో సినిమాకు రీమేక్‌లా ఉందే, ఫ్రీమేక్‌లా ఉందే అని లెక్కలేసుకునే జనాలున్న జమానా ఇది. ఇలాంటి రోజుల్లో అసలు విషయం చెప్పకపోతే… లాభం లేకపోగా తిరిగి ట్రోలింగ్‌ నష్టం ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నాం అనుకుంటున్నారా? గత కొన్ని రోజులుగా ఇలాంటి ట్రోలింగే ఎదుర్కొంటున్న ఓ సినిమా గురించి ఇప్పుడు దాదాపు క్లారిటీ వస్తోంది కాబట్టి. ఆ సినిమా ‘జైలర్‌’ అని మీకు అర్థమయ్యే ఉంటుంది.

రజనీకాంత్, నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ కాంబినేషన్‌లో ‘జైలర్’ అనే సినిమా రూపొందిన విషయం తెలిసిందే. ఈ సినిమాను ఆగస్టు 10న విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మొన్నీమధ్య ట్రైలర్‌ను రిలీజ్‌ చేస్తారు. అందులో చూపించిన సీన్లు, కథ, డైలాగ్‌లు బట్టి చూస్తే… ఇదేదో హాలీవుడ్‌ సినిమాకు రీమేక్‌ అని టాక్‌ వచ్చింది. ఆ తర్వాత ఆ సినిమా పేరు ‘నో బడీ’ అని చెప్పారు. ఈ విషయంలో టీమ్‌ నుండి క్లారిటీ అయితే రాలేదు కానీ.. ఇప్పుడు కాస్త స్పష్టత వస్తోంది. అయితే రీమేక్‌ కాదు కానీ.. ఆల్‌ మిక్సర్‌ అని అంటున్నారు.

‘జైలర్’ (Jailer) కథ కొన్ని పాత బ్లాక్ బస్టర్‌ సినిమాల మిక్సర్‌ అని అంటున్నారు. అందులో ఒకటి రజనీకాంత్‌ సినిమానే కాగా, మరొకటి బాలీవుడ్‌ సినిమా అని టాక్‌. ఇక మిగిలింది ‘నో బడీ’ అన్నమాట. ఇందులో హీరో ఐడెంటిటీ దాస్తున్నారు కాబట్టి… ఆ ఆలోచన ‘బాషా’ నుండి అంటున్నారు. ఇక గతంలో హీరో పేరు టైగర్‌. ఇలాంటి పాయింట్‌ అమితాబ్‌ బచ్చన్‌ బాలీవుడ్‌ సినిమాలోనిది అని చెబుతున్నారు. ఇలా మూడు, నాలుగు సినిమాలు కలిపి ఈ సినిమా కథను సిద్ధం చేశారని భోగట్టా.

అయితే, పుకార్లు నిజమా కాదా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగితే చాలు.. అయితే ఎన్ని మిక్సింగ్‌లు చేసినా.. ఆకట్టుకుంటే చాలు… మనదైన శైలిలో ఉంటే చాలు అని ఫ్యాన్స్‌ అంటున్నారు. మరి నెల్సా ఏం చేస్తారో చూడాలి.

ఆ హీరోల భార్యల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

రాంచరణ్ టు నాని.. ఈ 10 మంది హీరోలకి మొదటి వంద కోట్ల సినిమాలు ఇవే..!
పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus