దగ్గుబాటి రానా అఫైర్స్ పై ఇప్పటవరకూ వచ్చిన పుకార్లు ఇవే..!

రెండు రోజులుగా మీడియా అటెన్షన్ మొత్తం రానా అతని ప్రేయసి మిహీక బజాజ్ లపైనే. చడీచప్పుడు లేకుండా రానా, మిహికాను తన ప్రేయసిగా, కాబోయే భార్యగా పరిచడం చేశాడు. హైదరాబాద్ కి చెందిన మిహికా, రానాకు ఎప్పటి నుండో స్నేహితురాలని తెలుస్తుంది. కాగా త్వరలో వీరిద్దరూ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. ఈ విషయాన్ని రానా కుటుంబం కూడా ధృవీకరించింది.

ఐతే ఇంత పెద్ద న్యూస్ గురించి అసలు మీడియాకు కొంచెం కూడా అవగాహనా లేకపోవడం ఆశ్చర్యం. మిహికా ఎప్పటి నుండో రానాకు స్నేహితురాలిగా కొనసాగుతున్నా, వీరి మధ్య ప్రేమాయణం నడుస్తున్నా మీడియాకు మాత్రం సమాచారం లేదు. అసలు ఇంత వరకు చిన్న లీక్ కూడా లేకుండా పెద్ద బాంబ్ లాంటి వార్త బయటికి వచ్చింది. ఐతే గతంలో రానా దగ్గుబాటి అనేక మంది హీరోయిన్స్ తో అఫైర్స్ నడిపారని వార్తలు వచ్చాయి. రానా ప్రేమాయణం సాగించారంటూ వచ్చిన హీరోయిన్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం…

శ్రియా శరణ్

టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగిన శ్రీయా చరణ్ 2016లో రానాతో అనేక సందర్భాలలో కనిపించారు. వీరు నైట్ డిన్నర్ లో సన్నిహితంగా దిగిన ఫోటోలు కూడా బయటికి రావడంతో వీరి మధ్య ఎదో నడుస్తుందని అప్పట్లో మీడియాలో కథనాలు రావడం జరిగింది. ఐతే శ్రీయా వీటిని కొట్టిపారేసింది, ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయమైన రానా, నేను మంచి స్నేహితులం మాత్రమే అని చెప్పి, రూమర్స్ కి చెక్ పెట్టింది.

త్రిషా

2017లో సింగర్ సుచిత్ర అకౌంట్ ద్వారా సుచి లీక్స్ పేరున విడుదలైన కొందరు తారల ప్రైవేట్ ఫోటోలు కోలీవుడ్ లో ప్రకంపనలు రేపాయి. వాటిలో రానా మరియు త్రిషా సన్నిహితంగా ఉన్న ఫోటో కూడా ఉంది. అప్పటికే త్రిషా, రానా మధ్య అఫైర్ నడుస్తోందన్న పుకారు ఉండగా ఆ లీక్డ్ ఫోటో తర్వాత మరింత బలపడింది. ఐతే త్రిష, రానా మేము స్నేహితులం మాత్రమే అని చెప్పుకున్నారు.

బిపాసా బసు

2010లో లీడర్ సినిమాతో వెండితెరకు పరిచమైన రానా దగ్గుబాటి రెండో చిత్రంతోనే హిందీలో ఎంట్రీ ఇచ్చారు. అభిషేక్ బచ్చన్, బిపాసా బసు ప్రధాన పాత్రలలో 2011లో వచ్చిన దమ్ మారో దమ్ చిత్రంలో రానా ఓ కీలక రోల్ చేశారు. ఈ సినిమా సమయంలో బిపాసా బసుతో రానా ప్రేమాయణం నడిపాడని టాక్. అప్పటికే బిపాసా బసు జాన్ అబ్రహం తో బ్రేకప్ అయి ఉంది. ఈ ఆవార్తలను కూడా బిపాసా, రానా ఖండించారు.

రకుల్ ప్రీత్ సింగ్

బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ తో కూడా రానాకు అఫైర్ ఉందని వార్తలు వచ్చాయి. వీరు ప్రయివేట్ పార్టీలలో సన్నిహితంగా కనిపించడంతో ఈ వార్తలు వచ్చాయి. రానా నాకు మంచి స్నేహితుడు మాత్రమే, ఎందుకంటే ఆయన అప్పటికే ఒకరితో ప్రేమలో ఉన్నాడు అని తనదైన శైలిలో ఆమె చెక్ పెట్టింది. మరి అప్పుడు రకుల్ చెప్పిన రానా ప్రేయసి మిహికా నేనా లేకా ఇంకెవరైనా ఉన్నారా?

Most Recommended Video

దిల్ రాజు రెండో పెళ్ళి చేసుకున్న అమ్మాయి ఎవరో తెలుసా?
ఈ ఏడు రీజన్స్ తెలిస్తే ఆర్ ఆర్ ఆర్ ని వదిలిపెట్టరు
అతి తక్కువ వయసులో లోకం విడిచిన తారలు

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus