కాన్సెప్ట్ బేస్డ్ కథతో ఆనంద్ దేవరకొండ

‘‘దొరసాని’’ చిత్రంతో తెరంగేట్రం చేసిన హీరో ఆనంద్ దేవరకొండ నటించబోయే మూడో సినిమా అనౌన్స్ అయింది.ప్రస్తుతం రెండో సినిమా షూటింగ్ లో ఉన్న ఆనంద్ తన మూడో సినిమాగా ఓ కాన్సెప్ట్ బేస్డ్ కథను ఎంచుకున్నాడు. షార్ట్ ఫిలిం మేకర్ దామోదర అట్టాడ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు.టాంగా ప్రొడక్షన్స్ ఎల్.ఎల్.పి (యూ.ఎస్.ఏ) బ్యానర్ పై విజయ్ మట్టపల్లి,ప్రదీప్ ఎర్రబెల్లి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.విజయ దశమి సందర్భంగా ఈ చిత్రం అనౌన్స్ మెంట్ జరిగింది.ఈ సందర్భంగా…

నిర్మాతల్లో ఒకరైన *విజయ్ మట్టపల్లి* మాట్లాడుతూ : “పలు షార్ట్ ఫిలింస్ తో ఆకట్టుకున్న దామోదర అట్టాడ ఓ మంచి కాన్సెప్ట్ బేస్డ్ స్టోరీతో వచ్చాడు.ఈ కథ హీరో ఆనంద్ దేవరకొండ కు పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది.కామెడీ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ మూవీలో ఆనంద్ లుక్ కూడా కొత్తగా ఉంటుంది.ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారు.త్వరలోనే వాళ్ల పేర్లు ప్రకటిస్తాం.ఈ సినిమాతో ముగ్గురు కొత్త మ్యూజిక్ డైరెక్టర్లు టాలీవుడ్ కు పరిచయం కాబోతున్నారు.ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది.నవంబర్ లో రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది.మిగతా నటీనటుల వివరాలు త్వరలోనే తెలియజేస్తాం” అన్నారు.

సైరా నరసింహారెడ్డి చిత్రంలోని పవర్ ఫుల్ డైలాగ్స్
సైరా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus