డైరక్టర్ బాబీ పవర్ సినిమాతో సూపర్ గా ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా విజయంతో పవన్ కళ్యాణ్ ని డైరక్ట్ చేసే అవకాశం అందుకున్నారు. వీరి కాంబినేషన్లో వచ్చిన సర్ధార్ గబ్బర్ సింగ్ బాబీకి షాక్ ఇచ్చింది. దీంతో అతను మళ్లీ డైరక్టర్ గా నిరూపించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. కష్టపడి.. మంచి స్క్రిప్ట్ సిద్ధం చేసుకొని.. ఎన్టీఆర్ ని ఒప్పించి జై లవకుశ తెరకెక్కించారు. తారక్ ని మూడు పాత్రల్లో చూపించి అటు కలక్షన్స్ ని, ఇటు అభినందనలని అందుకున్నారు. అయినా బాబీ అదృష్టం మారలేదు.
అతనితో సినిమాలు చేయడానికి ఏ హీరో ఉత్సాహం చూపించలేదు. కొంతమంది తమ ప్రాజక్ట్స్ తో బిజీగా ఉండగా.. మరికొంతమందికి బాబీ కథ నచ్చక ఒకే చెప్పలేదు. దీంతో హీరోలు, నిర్మాతల చుట్టూ ఐదు నెలలలుగా బాబీ తిరిగారు. తాజాగా యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య బాబీ కథను నచ్చి ఒకే చెప్పినట్లు తెలిసింది. ప్రస్తుతం నాగచైతన్య తనకి ప్రేమమ్ వంటి హిట్ ఇచ్చిన చందు మొండేటి దర్శకత్వంలో సవ్యసాచి సినిమా చేస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా బాలీవుడ్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయం అవుతోంది. ఇది పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. దీని తర్వాతి సినిమాని కూడా చైతూ మొదలెట్టేసారు. మారుతీ దర్శకత్వంలో “శైలజా రెడ్డి అల్లుడు” సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ మూవీ పూర్తి కావడానికి మూడు నెలలు సమయం పడుతుంది. ఆ తర్వాత బాబీ, చైతూ ప్రాజక్ట్ పట్టాలెక్కనుంది.