స్టార్ హీరోకి కథ చెప్పిన సుజీత్!

  • March 2, 2021 / 04:11 PM IST

యంగ్ డైరెక్టర్ సుజీత్ తెలుగులో ‘రన్ రాజా రన్’ అనే సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు. ఆ తరువాత ప్రభాస్ హీరోగా ‘సాహో’ అనే భారీ బడ్జెట్ సినిమాను నిర్మించారు. ఈ సినిమాకి ప్లాప్ టాక్ వచ్చినప్పటికీ.. భారీ వసూళ్లను మాత్రం రాబాట్టింది. ఈ సినిమా ప్రభావం సుజీత్ పై పడిందనే చెప్పాలి. ‘సాహో’ తరువాత చాలా కాలం పాటు సుజీత్ ఖాళీగా ఉన్నాడు. మధ్యలో చిరంజీవి హీరోగా ‘లూసిఫర్’ రీమేక్ డైరెక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది. కానీ సుజీత్ చేసిన మార్పులు మెగాస్టార్ కి నచ్చకపోవడంతో అతడిని పక్కన పెట్టేశారు.

ఇక సుజీత్ కి అవకాశాలు రావేమోననే సమయంలో బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ జీ స్టూడియోస్ లో ఓ సినిమా చేయడానికి అంగీకరించాడు సుజీత్. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈ సినిమాని తెరకెక్కించనున్నారు. ఇదిలా ఉండగా.. తాజాగా సుజీత్ ఓ స్టార్ హీరోని కలిసి కథ వినిపించినట్లు తెలుస్తోంది. కన్నడ స్టార్ హీరో సుదీప్ ను ఇటీవల బెంగుళూరులో బిగ్ బాస్ షో సెట్స్ పై కలుసుకున్నాడు సుజీత్. అంతేకాదు.. తన దగ్గర ఉన్న ఓ కథను సుదీప్ కి వినిపించినట్లు సమాచారం.

అయితే ఈ విషయంలో సుదీప్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ చర్చల దశల్లో ఉంది. అన్నీ కుదిరితే పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమాను రూపొందించాలని ప్లాన్ చేస్తున్నాడు సుజీత్. అయితే ఈ ప్రాజెక్ట్ జీ స్టూడియోస్ లో చేస్తాడా..? లేక మరో బ్యానర్ లో చేస్తాడా..? అనే విషయంలో క్లారిటీ లేదు. ప్రస్తుతం సుదీప్ ‘కోటిగొబ్బ 3’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఇది ఏప్రిల్ నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Most Recommended Video

తన 11 ఏళ్ళ కేరీర్లో సమంత మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!
నాని కొన్ని హిట్ సినిమాలను కూడా మిస్ చేసుకున్నాడు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus