కూతురి గ్రాండ్ ఎంట్రీ కోసం యువ హీరోని సంప్రదించిన రాజశేఖర్!

  • November 24, 2017 / 10:35 AM IST

స్టార్ హీరోలు తమ కొడుకులను గ్రాండ్ గా వెండితెరపైకి తీసుకొస్తుంటే డాక్టర్ రాజశేఖర్ మాత్రం తమ కుమార్తెను హీరోయిన్ గా పరిచయం చేయడానికి శ్రమిస్తున్నారు. అనేక సంవత్సరాల తర్వాత గరుడ వేగా సినిమా ద్వారా హిట్ అందుకున్న రాజశేఖర్ చాలా సంతోషంలో ఉన్నారు. ఈ ఉత్సాహంతోనే తమ పెద్ద కూతురు శివాని సినీ అరంగ్రేటం గురించి ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం మెడిసిన్ చివరి సంవత్సరం చదువుతున్న శివాని కమర్షియల్ హీరోయిన్‌గా మంచి పేరు తెచ్చుకోవాలనే పట్టుదలతో  రాజశేఖర్ దంపతులు ఉన్నారు.  ఆమె ఎంట్రీ గురించి రాజశేఖర్ మాట్లాడుతూ శివాని మెడిసిన్ పూర్తవగానే సినీ రంగంలోకి వస్తుందని చెప్పారు.

అయితే ఫామ్లో ఉన్న హీరోతో సినిమా చేస్తే శివాని ఎంట్రీ బాగుందని భావించిన రాజశేఖర్ విజయ్ దేవరకొండ సరసన నటింపచేయించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. పెళ్లి చూపులతో అందరి దృష్టిలో పడ్డ ఈ హీరో అర్జున్ రెడ్డి తో స్టార్ హీరో లకి ఉండే క్రేజ్ ని సొంతం చేసుకున్నారు. అతని సినిమా కోసం యువత ఎదురుచూస్తున్నారు. అంతలా క్రేజ్ సంపాదించుకున్న విజయ్ కి జోడీగా శివాని త్వరలోనే కనిపించనుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus