Karthi: ‘ఖైదీ 2’ ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇచ్చే న్యూస్..!

2019 లో కార్తీ హీరోగా వచ్చిన ‘ఖైదీ’ చిత్రం ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ టైంలో ప్లాపుల్లో ఉన్న హీరో కార్తీకి ఈ చిత్రం మంచి విజయాన్ని అందించింది. దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఈ చిత్రంతో ఒక్కసారిగా స్టార్ డైరెక్టర్ అయిపోయాడు. కేవలం 53 రోజుల్లోనే ఈ చిత్రాన్ని తెరకెక్కించి సెన్సేషన్ క్రియేట్ చేశాడు.దీనికి లింక్ పెడుతూ లోకేష్ కనగరాజ్ తర్వాత ‘విక్రమ్’ ‘లియో’ వంటి చిత్రాలని తెరకెక్కించిన సంగతి తెలిసిందే.

ఇందులో ‘విక్రమ్’ పెద్ద సక్సెస్ అయ్యింది. ‘లియో’ కి నెగిటివ్ టాక్ వచ్చినా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించి ఇప్పటికీ డీసెంట్ కలెక్షన్స్ ని సాధిస్తుంది అని చెప్పాలి. ఇదిలా ఉండగా.. ‘ఖైదీ’ కి సీక్వెల్ ఉంటుంది అని లోకేష్ కనగరాజ్.. ఆ సినిమా ప్రమోషన్స్ లోనే ప్రకటించాడు. కానీ ఎందుకో ఆ ప్రాజెక్టు పై అతను దృష్టి పెట్టలేదు. ఇక తర్వాత ‘మాస్టర్’ ‘విక్రమ్’ ‘లియో’ వంటి పెద్ద ప్రాజెక్టులతో బిజీ అయిపోయాడు.

తర్వాత అతను ‘ఖైదీ 2 ‘ గురించి మాట్లాడింది కూడా లేదు. అయితే తాజాగా ‘జపాన్’ సినిమా ప్రమోషన్స్ కోసం హైదరాబాద్ వచ్చిన కార్తీ ‘ఖైదీ 2 ‘ పై స్పందించాడు. అతను మాట్లాడుతూ.. ” ‘ఖైదీ 2 ‘ తప్పకుండా ఉంటుంది. లోకేష్ ప్రస్తుతం రజినీకాంత్ గారితో ఓ సినిమా చేస్తున్నారు. అది కంప్లీట్ అయ్యాక ‘ఖైదీ 2 ‘ ఉంటుంది” అంటూ చెప్పుకొచ్చాడు (Karthi) కార్తీ.

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!

‘సైందవ్’ తో పాటు టాలీవుడ్లో వచ్చిన ఫాదర్-డాటర్ సెంటిమెంట్ మూవీస్ లిస్ట్..!
ఆ హీరోయిన్స్ చేతిలో ఒక సినిమా కూడా లేదంట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus