కోవిడ్ సమయంలో ఎందరో అభాగ్యులను ఆదుకున్నాడు నటుడు సోనూసూద్. వలస కార్మికుల నుండి మొదలుపెట్టి ఆన్లైన్ క్లాస్ ల కోసం స్టూడెంట్స్ కి ఫోన్లు, ల్యాప్ టాప్ లు అందించేవరకు తనవంతు సేవ చేశాడు. ఇప్పటికీ ఎంతో మందికి సాయం అందిస్తూనే ఉన్నాడు. ఈ పనులన్నీ చేయడానికి సోనూకి కోట్లలో ఖర్చవుతుందని.. ఆ డబ్బు ఎక్కడ నుండి వస్తుందని అనుకునే వాళ్లు కూడా చాలా మంది ఉన్నారు. ఇలాంటి ప్రశ్నలకు ఇప్పుడు సమాధానం దొరికింది.
డబ్బున్నా కూడా సాయం చేయడానికి ఆలోచించేవారు చాలా మంది ఉన్నారు. కానీ సోనూసూద్ అలా అనుకోలేదు. తన చేతిలో డబ్బు లేకపోయినా.. తన ఆస్తులను తాకట్టు పెట్టి మరీ డబ్బు తీసుకొచ్చాడు. ముంబైలోని జూహూ ఏరియాలో తనకున్న కొన్ని ఆస్తులను తనఖా పెట్టి రూ.10 కోట్ల రూపాయలు అప్పుగా తీసుకున్నాడట. ఆ డబ్బుతోనే అందరినీ సాయం చేస్తూ వచ్చాడు. ఒప్పందం ప్రకారం సెప్టెంబర్ 15న సాంతం చేశారని.. నవంబర్ 24న నమోదు చేయబడిందని సమాచారం.
దీని గురించి జెఎల్‌ఎల్ ఇండియా రెసిడెన్షియల్ సర్వీసెస్ సీనియర్ డైరెక్టర్, హెడ్ రితేష్ మెహతా మాట్లాడారు. ఆస్తులన్నీ కూడా సోనూసూద్ అతడి భార్య పేరు మీదే ఉన్నాయని.. దీనికి సంబంధించిన రెంటల్ కూడా వారు అందుకుంటున్నారని అన్నారు. తనఖా తరువాత రూ.10 కోట్లకు వడ్డీ, అసలు చెల్లించాల్సి ఉందని చెప్పారు. అయితే ఇప్పటివరకు దీనిపై సోనూసూద్ స్పందించలేదు.
Most Recommended Video
ఈ 10 మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయ్యారు..!
బ్రహ్మీ టు వెన్నెల కిషోర్.. టాలీవుడ్ టాప్ కమెడియన్స్ రెమ్యూనరేషన్స్ లిస్ట్..!
లాక్ డౌన్ టైములో పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్..!