Nani: నాని కామెంట్స్ కు షాకైనా యానిమల్ డైరెక్టర్ సందీప్ వంగా..!

ఈ సంవత్సరం చివరి నెల డిసెంబర్ లో ఎన్నో సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. అందులో ముఖ్యంగా ‘యానిమల్’, ‘హాయ్ నాన్న’పైనే ప్రేక్షకుల దృష్టి ఎక్కువగా ఉంది. ఈ రెండు సినిమాలు.. రెండు వేర్వేరు కాన్సెప్ట్స్‌తో తెరకెక్కుతున్నాయి. రెండిటికీ అసలు సంబంధం లేదు. కానీ వీటికోసమే ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పటికే ‘యానిమల్’ చిత్రం థియేటర్లలో విడుదలయ్యి మంచి టాక్‌తో ముందుకెళ్తుంది. అయితే యానిమల్ పై నేచురల్ స్టార్ నాని షాకింగ్ కామెంట్ చేశారు.

యానిమల్’ ప్రమోషన్స్ కోసం రణబీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగా ఎంత కష్టపడుతున్నారో.. ‘హాయ్ నాన్న’ ప్రమోషన్స్ కోసం నాని కూడా అంతే కష్టపడుతున్నాడు. ఇప్పటికే ఈ రెండు సినిమాలపై ప్రేక్షకుల్లో విపరీతంగా హైప్ ఉండడంతో దానిని మరింత పెంచడం కోసం సందీప్ వంగా, నాని (Nani) కలిసి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో హోస్ట్ అంటూ ఎవరూ లేరు. ఈ ఇద్దరు మాత్రమే వారి సినిమాల గురించి ప్రేక్షకులకు చెప్తూ వాటిని ప్రమోట్ చేసుకోవాలి.

ఇక ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత వారి సినిమాలపై ప్రేక్షకులకు మరింత క్లారిటీ వస్తోంది. అయితే ఇందులో ‘యానిమల్’ చిత్రాన్ని అలనాటి ‘ధర్మచక్రం’తో పోలుస్తూ మాట్లాడాడు నాని. ‘యానిమల్’ సినిమా టీజర్ చూసిన తర్వాత తనకు 1996లో విడుదలైన ‘ధర్మచక్రం’ గుర్తొచ్చిందని సందీప్‌తో పాల్గొన్న ఇంటర్వ్యూలో నాని బయటపెట్టాడు. వెంకటేశ్ హీరోగా నటించిన ‘ధర్మచక్రం’ కూడా ఒక తండ్రి, కొడుకుల అనుబంధంపై ఆధారపడిన సినిమానే. అందులో వెంకటేశ్ తండ్రి పాత్రలో మహేంద్ర కనిపించారు.

అయితే ఆ సినిమాలకు, తన సినిమాకు చాలా తేడా ఉంటుందని, సినిమా చూస్తే ప్రేక్షకుల దృక్పథం కచ్చితంగా మారుతుందని అన్నాడు సందీప్. అంతే కాకుండా ‘ధర్మచక్రం’, ‘కిరాతకుడు’ వంటి సినిమాలు చాలాకాలం క్రితం చూశానని, వాటి గురించి తనకు సరిగ్గా గుర్తులేదని ఓపెన్‌గా చెప్పేశాడు. ఇక ఈ శుక్రవారం.. థియేటర్లలో విడుదలయిన ‘యానిమల్’కు అంతటా పాజిటివ్ టాక్ లభిస్తోంది. హాయ్ నాన్న ఈ నెల 7వతేదీ థియేటర్స్ లోకి రాబోతుంది.

యానిమల్ సినిమా రివ్యూ & రేటింగ్!

దూత వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus