Hero Nani: నిర్మాణ రంగంలో బిగ్ లీగ్లోకి వెళ్ళబోతున్నాడా?

నేచురల్ స్టార్ నాని (Nani) హీరోగా సూపర్ ఫామ్లో ఉన్నాడు. మిడ్ రేంజ్ హీరోల్లో నెంబర్ నెంబర్ వన్ ప్లేస్ లో ఉన్నాడు నాని. అతని ఖాతాలో రెండు వంద కోట్ల సినిమాలు ఉన్నాయి. నాని సినిమా అంటే మినిమం గ్యారెంటీ అనే నమ్మకం నిర్మాతల్లోనే కాదు డిస్ట్రిబ్యూటర్స్ లోనూ, ప్రేక్షకుల్లో కూడా ఉంది. అందుకే నాని సినిమాలకి వంద కోట్లు బడ్జెట్ పెట్టడానికి కూడా నిర్మాతలు రెడీగా ఉంటున్నారు. ప్రస్తుతం నాని ఒక్కో సినిమాకు రూ.25 కోట్ల నుండి రూ.30 కోట్లు పారితోషికం అందుకుంటున్నాడు.

Hero Nani

నానికి థియేట్రికల్ మార్కెట్ రూ.40 కోట్లు ఉంది. నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో మరో రూ.60 కోట్ల నుండి రూ.70 కోట్ల వరకు వచ్చేస్తాయి.సో నానిపై వంద కోట్లు పెట్టడం నిర్మాతకి రిస్క్ ఏమీ కాదు. హీరోగా సేఫ్ పొజిషన్లో ఉన్న నాని నిర్మాతగా కూడా నెక్స్ట్ లెవెల్ కి వెళ్లాలని భావిస్తున్నాడు. రూ.4 కోట్ల బడ్జెట్ తో మొదటి ప్రయత్నంగా ‘అ!’ (Awe) చిత్రాన్ని నిర్మించాడు నాని. ఆ సినిమాకి లాభాలు వచ్చాయి. తర్వాత రూ.7 కోట్ల బడ్జెట్ పెట్టి ‘హిట్'(హిట్ : ది ఫస్ట్ కేస్) (HIT: The First Case) చేశాడు.

అది కూడా విజయం సాధించింది. ఇక ‘హిట్ 2′(హిట్ : ది సెకండ్ కేస్) (HIT: The Second Case) కి రూ.20 కోట్ల వరకు బడ్జెట్ పెట్టాడు. అది కూడా హిట్ అయ్యింది. ఇప్పుడు ‘హిట్ 3’ చేస్తున్నాడు. దీనికి రూ.80 కోట్ల వరకు బడ్జెట్ పెడుతున్నట్టు వినికిడి. నానినే నిర్మాత కాబట్టి.. పారితోషికంతో పనిలేదు. లాభాలు ఎంతొచ్చినా అవి నానికే..! ఇదిలా ఉంటే.. తాజాగా చిరంజీవితో ఓ సినిమా ప్రకటించాడు నాని. శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో చిరంజీవి (Chiranjeevi)  హీరో. సింగిల్ సిట్టింగ్లో చిరుని ఒప్పించి ప్రాజెక్టు సెట్ చేసుకున్నాడు. ఇక ఈ చిత్రానికి ఏకంగా రూ.150 కోట్లు బడ్జెట్ పెట్టబోతున్నాడు.

అంటే ‘హిట్ 3’ కి ఆల్మోస్ట్ డబుల్ బడ్జెట్ పెడుతున్నట్టే. ఇంత బడ్జెట్ నాని (Hero Nani) వంటి మిడ్ రేంజ్ హీరో ఎలా పెడతాడు? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. అయితే ఇక్కడ నాని మెయిన్ నిర్మాత కాదు. సుధాకర్ చెరుకూరి మెయిన్ నిర్మాత. నాని సహా నిర్మాత. అంటే నాని ఈ సినిమాకి టైం తప్ప.. డబ్బు పెట్టేది అంటూ ఏమీ ఉండదు. కానీ లాభాల్లో అతను వాటా తీసుకుంటాడు. ప్రస్తుతం నాని.. శ్రీకాంత్ ఓదెల  దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. దీనికి కూడా సుధాకర్ చెరుకూరినే నిర్మాత.

ఇదొక్కటి చాలు సినిమాకు ఊర మాస్‌ ప్రమోషన్‌ రావడానికి..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags