Nani: కరోనా టైమ్ లో ఇంత స్పీడ్ అవసరమా..?

  • April 19, 2021 / 07:09 PM IST

నేచురల్ స్టార్ నాని షూటింగ్ విషయంలో తొందర పడుతున్నాడనే మాటలు ఇండస్ట్రీలో బాగా వినిపిస్తున్నాయి. ఓ పక్క రోజురోజుకి కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. విడుదల డేట్లు అనౌన్స్ చేసి.. దగ్గరకు వచ్చేసిన సినిమాలే షూటింగ్ లు ఆపేశాయి. నాని నటించిన ‘టక్ జగదీష్’ సినిమా రిలీజ్ డేట్ కూడా వాయిదా వేసుకున్నారు. అసలు రాబోయే రెండు నెలల్లో సినిమా రిలీజ్ లు ఉంటాయో లేదో తెలియని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో నాని షూటింగ్ విషయంలో తొందర పడుతుండడం విచిత్రంగా ఉంది.

ప్రస్తుతం ఈ హీరో ‘శ్యామ్ సింగరాయ్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. మరో నెల రోజుల్లో షూటింగ్ పూర్తవుతుంది. అంటే నాని నటించిన ఒక సినిమా రిలీజ్ కి సిద్ధమైంది, మరో సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావొస్తుంది. ఈ రెండు సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయో తెలియదు కానీ ఇంతలో నాని మరో సినిమా మొదలెట్టేశాడు. నాని-నజ్రియా జంటగా ‘అంటే సుందరానికి’ అనే సినిమా షూటింగ్ ఈరోజు మోడలింది. మలయాళీ బ్యూటీ నజ్రియా హైదరాబాద్ కు వచ్చి షూటింగ్ లో పాల్గొంది.

అయితే కరోనా సమయంలో నాని ఎందుకు ఇంత కంగారుగా షూటింగ్ చేస్తున్నాడనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. సెకండ్ వేవ్ కల్లోలం సృష్టిస్తోన్న ఈ సమయంలో నాని రెండు సినిమాలు అర్జెంట్ గా షూట్ చేయాల్సిన అవసరం ఏముందనే మాటలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. నిజానికి నానికి సినిమాలు స్పీడ్ గా పూర్తి చేయడం అలవాటు. దాని వలన కార్మికులకు కూడా ఉపాధి దొరుకుతుంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో కొన్నాళ్లపాటు షూటింగ్ లు వాయిదా వేసుకుంటేనే మంచిది. ప్రభుత్వం లాక్ డౌన్ విధిస్తే తప్ప షూటింగ్ లు ఆగేలా లేవు!

Most Recommended Video

‘పవన్ కళ్యాణ్’ హీరోగా రూపొందిన 11 రీమేక్ సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
పెళ్లయ్యి కూడా పెళ్లి కానట్టు ఉండే 10 మంది టాలీవుడ్ భామల లిస్ట్..!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus