Hero Nani: నాని క్రికెట్‌ అయిపోయింది.. ఇప్పుడు ఫుట్‌బాట్‌

  • May 21, 2021 / 01:14 PM IST

నేచురల్‌ స్టార్‌ నానికి పాన్‌ ఇండియా సినిమా మీద మోజు పుట్టినట్లుంది. తన తోటి హీరోలందరూ పాన్‌ ఇండియా రేంజి ఆలోచనలు చేస్తుంటే నేనెందుకు చేయకూడదు అనుకున్నాడో ఏమో… ఒక పాన్‌ ఇండియా కథ కోసం వెతుకులాట మొదటైందంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు. అంతే కాదు దానికి క్రీడా నేపథ్యం ఉంటేనే బాగుంటుంది అని కూడా నాని అనుకుంటున్నాడట. ఎవరైనా అలాంటి కథతో ముందుకొస్తే పాన్‌ ఇండియా సినిమా తీసేద్దాం అని అనుకుంటున్నారట. అయితే తాజాగా ఓ కథ అతని దగ్గరకు వచ్చిందట.

స్పోర్ట్స్‌ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా అంటే కచ్చితంగా అందరికీ కనెక్ట్‌ అవుతుంది. అందుకే పాన్‌ ఇండియా అనగానే ఇలాంటి ఆలోచన వస్తూ ఉంటుంది. తాజాగా నాని ఇలాంటి ఆలోచనే చేస్తున్నాడట. అందుకు తగ్గట్టే ఓ దర్శకుడు ఫుట్‌బాల్‌ నేపథ్యంలో ఓ కథ వినిపించాడట. అది ప్రముఖ ఫుట్‌బాల్‌ క్రీడాకారుడు బైచుంగ్‌ భూటియా జీవిత కథ అని అంటున్నారు. ఒకవేళ అంతా ఓకే అయితే ఈ సినిమాను పాన్‌ ఇండియా లెవల్‌లో తీస్తారని టాక్‌. త్వరలో దీని వివరాలు అధికారికంగా ప్రకటిస్తారని అంటున్నారు.

‘జెర్సీ’తో క్రీడా నేపథ్య కథలు బాగా చేయగలుగుతా అని నాని ఇప్పటికే నిరూపించాడు. ఆ సినిమా ఇచ్చిన విజయం, అందుకున్న రివార్డులే ఇప్పుడు నాని స్పోర్ట్స్‌ డ్రామా వైపు తీసుకెళ్లాయని కూడా అనుకోవచ్చు. బైచుంగ్‌ భూటియాను భారత ఫుట్‌బాల్‌ టార్చ్‌ బేరర్‌ అని చెప్పొచ్చు. ఆయన జీవితం సినిమగా తీస్తే ఎందరికో స్ఫూర్తిగా ఉంటుంది. అయితే బైచుంగ్‌ జీవితం ఆధారంగా సినిమా తీయడానికి గతంలో బాలీవుడ్‌లో ప్రయత్నాలు జరిగాయి. కానీ కార్యరూపం దాల్చలేదు.

Most Recommended Video

టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus