Nani: ఆ లోటు తీర్చాలనుకుంటున్న నాని!

నేచురల్ స్టార్ నాని (Nani)   వరుస హిట్లతో సూపర్ ఫామ్లో ఉన్నాడు. ఈ మధ్యనే ‘హిట్ 3’ (HIT 3) వచ్చింది. సూపర్ హిట్ అయ్యింది. ఆడియన్స్ థియేటర్ కి రావడం తగ్గించిన ఈ రోజుల్లో కూడా ‘హిట్ 3’ 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ లో పాల్గొంటూనే మరోపక్క తన నెక్స్ట్ సినిమా కోసం కూడా రెడీ అయిపోతున్నాడు నాని. తనకు ‘దసరా’ (Dasara)  వంటి సూపర్ హిట్ ఇచ్చిన శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela)  దర్శకత్వంలో నాని మరో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే.

Nani

దీనికి ‘ది పారడైజ్’ (The Paradise)  అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేశారు. ఇది కూడా నానిని అభిమానించే ఫ్యామిలీ ఆడియన్స్ చూడలేని విధంగా ఉంటుంది అని స్వయంగా అతనే తెలిపాడు. గ్లింప్స్ లో ఉన్న బూతులను బట్టి అది నిజమే అని అర్థం చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే.. ఈ సినిమా కోసం నాని కొంచెం ఎక్కువగానే కష్టపడాల్సి ఉందట. ఎందుకంటే ‘ది పారడైజ్’ లో నాని ఎక్కువ సీన్లలో షర్ట్ లెస్ గా కనిపించాల్సి ఉందట.

అందుకోసం అతను సిక్స్ ప్యాక్ వంటివి చేయాల్సి ఉందని అంటున్నారు. నాని కూడా స్పెషల్ ట్రైనర్ ను పెట్టుకుని కసరత్తులు చేయడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటివరకు సినిమా సినిమాకి నాని లుక్స్ అయితే మారుస్తూ వస్తున్నాడు కానీ.. తన బాడీ విషయంలో కొత్తగా ఏమీ ట్రై చేయడం లేదు. ‘ది పారడైజ్’ తో ఆ లోటు తీరాలని నాని అభిమానులు కూడా ఆశపడుతున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus