ఓవర్సీస్ లో దుమ్ము రేపుతున్న నాని

  • March 1, 2016 / 11:46 AM IST

సహజంగా ఒక హీరో యొక్క స్టామినాను కొలవాలన్నా, అతని కాలిబెర్ ను తెలుసుకోవాలన్నా మన ముందుగా చూసేది ఆహీరో యొక్క సినిమా హిట్స్ మరియు కలెక్షన్స్. అయితే ఇప్పుడున్న టెక్నాలజీ పుణ్యమా అంటూ సోసియల్ నెట్‌వర్కింగ్ సైట్స్ పుణ్యమా అంటూ హీరో కెప్యాసిటీ తెలుసుకోవడానికి ఆ హీరోకు ఆన్‌లైన్ లో వస్తున్న లైక్స్, వ్యూయర్ షిప్, బట్టి కూడా హీరో పోపులారిటీని అంచనా వెయ్యవచ్చు. ఇక ప్రస్తుతం ఉన్న వ్యూయర్ షిప్ లో ఎక్కువశాతం ప్రేక్షకులు పవన్ కల్యాణ్ ను, అటుపై మహేష్ పై వచ్చే వార్తలను ఇష్టపడుతున్నారు. ఇక ఆ తరువాత స్థానంలో నాని ఉన్నాడు. కరియర్ మధ్యలో వరుస పరాజయాలతో నాని ఇబ్బంది పడినప్పటికీ భలే..భలే మగాడివోయ్ సినిమాతో  భారీ హిట్ సాధించి, ఆ తరువాత వచ్చిన కృష్ణ గాడి వీర ప్రేమ గాధ సినిమాతో మరొక బ్లాక్ బష్టర్ హిట్ ను అనుకున్నాడు.

 

ఇక రెండు సినిమాలతో నాని స్టార్‌డం ఒక్కసారిగా పెరిగిపోయి, ముఖ్యంగా ఓవెర్సీస్ లో నాని మంచి స్తానాన్ని సంపాదించుకున్నాడు. మొన్నటివరకూ నానిని పెద్దగా పట్టించుకొని ఓవెర్సీస్ వ్యూవర్స్ ఒక్కసారిగా నాని వార్తలపై అభిమానం పెంచుకోవడంతో, కొందరు టాప్ హీరో ఫాన్స్ అయితే ఒక్కసారిగా అవాక్కు అయ్యారు. ఇక్కడ లోకల్ లో సైతం నానికి మంచి స్టార్‌డం ఉండడంతో ఇలాగే మంచి సినిమాలతో ముందుకు పోతే నాని ఖచ్చితంగా 40కోట్ల హీరో అవుతాడు అని టాలీవుడ్ విశ్లేషకులు చెబుతున్నారు. ఏది ఏమైనా…న్యాచురల్ స్టార్ సూపర్ అనే చెప్పాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus