ప్రీరిలీజ్ ఈవెంట్లు, ప్రచార కార్యక్రమాలకు నాని హాజరైతే… పంచ్‌లు తప్పనిసరి అనిపిస్తోంది. మొన్నామధ్య ‘తిమ్మరసు’ ప్రీరిలీజ్ ఈవెంట్‌కి వచ్చిన నాని… టాలీవుడ్ విషయంలో ఏపీ ప్రభుత్వం విధానాలను తప్పుపట్టారు. చిన్నపాటి చురకలు అంటించారు. దానిపై అప్పుడు చర్చ కూడా జరిగింది. ఇప్పుడు మరోసారి నాని అలాంటి పనే చేశారు. అయితే ఈసారి ఇన్‌డైరెక్ట్ పంచ్‌లు వేశారు. ‘స్కైల్యాబ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు నాని ముఖ్య అతిథిగా వచ్చిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో సినిమా గురించి, సినిమాలో నటించినవాళ్ల గురించి మాట్లాడాడు. ఆ తర్వాత ఏపీలో సినిమా టికెట్ల రేట్లు, థియేటర్ల గురించి తానేమీ మాట్లాడను అంటూనే పంచ్ వేశాడు నాని. ఓసారి టికెట్ల రేట్లు, థియేటర్ల గురించి మాట్లాడనని, ఇప్పుడు మిగతా వాళ్లు మాట్లాడతారేమో చూద్దాం అని అన్నాడు. దీంతో ఇన్‌డైరెక్ట్‌గా మిగిలినవాళ్లు స్పందించడం లేదు అని కౌంటర్ వేశాడు నాని. ఏపీలో టికెట్ రేట్లను నియంత్రించడం వల్ల టాలీవుడ్ పెద్ద సమస్యే ఎదుర్కుంటోంది.
ప్రభుత్వ నిర్ణయంతో ఏపీలో ఎగ్జిబిటర్ వ్యవస్థే పెద్ద ముప్పును ఎదుర్కుంటోంది. దాంతో ఆ ప్రభావం సినిమా రంగం మీద పడుతోంది. ఈ విషయమై ఇప్పటివరకు పవన్ కల్యాణ్, సురేశ్‌బాబు లాంటివాళ్లు బహిరంగంగా మాట్లాడారు. నాని, కార్తికేయ లాంటి ఒకరిద్దరు యువ కథానాయకులే స్పందించారు. చిరంజీవి అయితే తన పెద్దరికం చూపిస్తూ సూచన చేశారు. మిగతా వాళ్లంతా గప్‌చుప్.
Most Recommended Video
టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే..!
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
ఈ 15 మంది హీరోయిన్లు విలన్లుగా కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా..?