నాని ‘నోరు’ జారాడు!!!

సహజంగా ఆడియో ఫంక్షన్స్ లో మన హీరోలు చేస్తున్న కొమెంట్స్ పెద్దగా కలసి రావడంలేదు. అప్పుడెప్పుడో ఆలీ అనుష్క అందాన్ని వ్యంగ్యంగా వర్ణిస్తూ ఆమె తోడలపై కాస్త ఘాటైన వ్యాఖ్యలు చేయడంతో అప్పట్లో ఈ విషయం పెద్ద దుమారాన్నే రేపింది. అయితే ఆ వ్యవహారం సర్ధు మనుగుతుంది అని అనుకునే లోపే నట సింహం నందమూరి బాలకృష్ణ నారా రోహిత్ సావిత్రి ఆడియో వేడుకలో హీరో క్యారెక్టర్ ను వివరిస్తూ ఆడవారిపై చేసిన కామెంట్స్ ఆయన కొంప ముంచే అంత పని చేశాయి. ఆ మాటలు వెనక్కి తీసుకుని చివరకు బాలయ్య అస్సెంబ్లీ సాక్షిగా క్షమాపణలు కూడా చెప్పారు. ఇదిలా ఉంటే మన ప్రేక్షక దేవుళ్ళు ఆ వార్తలు మరచిపోతున్నారులే అని అనుకుంటున్నారో లేదో, నిన్న జరిగిన సుప్రీమ్ ఆడియో వేడుకలో న్యాచురల్ స్టార్ నాని ఆ సినిమాలోని హీరోయిన్ రాశి ఖన్నాపై చేసిన కొన్ని సంచలన కామెంట్స్ ఇప్పుడు హాట్ హాట్ గా మారాయి. ఈ ఫంక్షన్ కు అతిథిగా వచ్చిన  నాని ఈ సినిమా గురించి మాట్లాడుతూ  తాను నిన్ననే ఈ సినిమా లోని  సాయి ధరమ్ తేజ్ రాశి ఖన్నాలు నటించిన ఒకనాటి చిరంజీవి ‘సుప్రీమ్ హీరో’ పాట రీమిక్స్ సాంగ్ చూశానని వెంటనే అనందం తట్టుకోలేక ఈల వేద్దామని అని అనిపించింది అంటూ ప్రశంసలు కురిపించాడు. అంతేకాకుండా ఈ పాటలో రాశి ఖన్నా గ్లామర్ తో పాటు ఆమె అందమైన నడుముని  చూసిన వారు ఎవరైనా వెంటనే ఈలలు వేస్తారు అనేసరికి ఆ ఆడియో వేడుకకు వచ్చిన వారంతా నవ్వుల్లో మునిగిపోగా, ఇక ఆ నవ్వుల్లో రాశి తెగ సిగ్గు పడిపోయింది. మరి అసలే కరియర్ లో ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ వస్తున్న నాని ఇలా మాట్లాడితే విమర్శల పాలైపోడు…..నాని బాబు కాస్త జాగ్రత్త నాయనా!!!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus