Nani Wife Anjana: నాని భార్య అంజన డ్యాన్స్ వీడియో వైరల్..!

నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా నజ్రియా హీరోయిన్ గా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అంటే సుందరానికీ’. మలయాళం స్టార్ హీరోయిన్ అయిన నజ్రియా నజీమ్‌ ఈ చిత్రంతో టాలీవుడ్‌ కు ఎంట్రీ ఇస్తుంది. రేపు అంటే జూన్‌ 10న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ‘మైత్రి మూవీ మేకర్స్’ వారు ఈ చిత్రాన్ని నిర్మించారు.ఇక ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ప్రోమో సాంగ్ ను కూడా విడుదల చేశారు మేకర్స్.

యూట్యూబ్‌లో ఈ పాటకి మంచి రెస్పాన్స్ లభిస్తుంది.అయితే ఈ పాట కోసం రిహార్సల్స్ చేస్తున్న టైంలోనో ఏమో కానీ హీరోయిన్ నజ్రియా తో కలిసి నాని భార్య అంజన యలవర్తి కూడా స్టెప్పులేసింది. స్క్రీన్‌పై పాట ప్లే అవుతున్న సమయంలో.. నజ్రియా, అంజనా..నానితో పాటు స్టెప్పులేశారు. ఈ వీడియోని నజ్రియా తన ఇన్స్టాలో షేర్ చేసింది. నజ్రియా ఇన్స్టాగ్రామ్ ఖాతాకి 5 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉండడంతో ఈ వీడియో వెంటనే వైరల్ అయిపోయింది.

నాని, అంజ‌నల‌తో క‌లిసి డ్యాన్స్ చేయ‌డం ఆనందంగా కలిగించిందని నజ్రియా రాసుకొచ్చింది. నాని, అంజన లది ప్రేమ వివాహం అన్న సంగతి తెలిసిందే.ఈమె ఔట్ ఆఫ్ ఫోకస్ లో ఉంటారు. అలాంటి అంజన ఇప్పుడు డ్యాన్స్ చేస్తూ కనబడడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. ఇక ‘అంటే సుందరానికి’ చిత్రంలో నాని ఓ బ్రాహ్మణ యువకుడిగా కనిపించబోతుండగా..

నజ్రియా ఓ క్రిస్టియన్ అమ్మాయిగా కనిపించబోతుంది. టీజర్, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ‘శ్యామ్ సింగ రాయ్’ తర్వాత నాని మరో హిట్ అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. హిట్ టాక్ వస్తే మాత్రం ఈ వారం కూడా బాక్సాఫీస్ దద్దరిల్లడం ఖాయంగా కనిపిస్తుంది.

మేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

విక్రమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు నితిన్… ఛాలెంజింగ్ పాత్రలు చేసిన 10 మంది హీరోల లిస్ట్
ప్రభాస్ టు నాని… నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా కలెక్ట్ చేసే హీరోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus