శ్రీరెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన నాని భార్య!

వివాదాస్ప‌ద న‌టి శ్రీరెడ్డి విజయాలకంటే వివాదాలతోనే వార్తల్లో ఉండటానికి ఇష్టపడుతోంది. కొన్ని రోజుల క్రితం పలువురిపై ఘాటు విమర్శలు చేసి.. వివాదాల్లో చిక్కుకున్న ఈమెకి.. గత సంఘటనలు మార్పు తీసుకురాలేకపోయాయి. తాజాగా నేచుర‌ల్ స్టార్ నానిపై  సోష‌ల్ మీడియా ద్వారా అస‌భ్య‌క‌ర వ్యాఖ్య‌లు చేసింది. తాను `బిగ్‌బాస్‌-2`కు ఎంపిక కాక‌పోవ‌డానికి కార‌ణం నానియే అని ఆరోపిస్తూ, నానిపై త‌న ఫేస్‌బుక్ పోస్ట్‌లో శ్రీరెడ్డి శృతిమించి వ్యాఖ్య‌లు చేసింది. ఆ కామెంట్స్ కి రిప్లై ఇస్తే సరిపోదని భావించిన నాని ఆమెకి  లీగ‌ల్ నోటీసులు పంపించారు. ఆ విషయాన్నీ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ “స‌హ‌నానికి కూడా ఓ హ‌ద్దు ఉంటుంది” అని కామెంట్ చేశారు. వీరిద్దరి గొడవపై నాని భార్య అంజ‌న తాజాగా ట్విట‌ర్ ద్వారా స్పందించారు.

“సినీ ప‌రిశ్ర‌మ చాలా ద‌యాగుణంతో ఉంటుంది. కానీ, ప‌బ్లిస‌టీ కోసం వేరొక‌రి జీవితాల‌తో ఆడుకుంటున్న వారు కూడా అప్పుడప్పుడు అందులోకి వ‌స్తుండ‌డం నన్ను ఇబ్బందికి గురిచేస్తోంది. అయితే వారు చేస్తున్న చెత్త కామెంట్లను ఎవ‌రూ ప‌ట్టించుకోర‌నుకోండి. కానీ వాళ్ళ వ్య‌క్తిగత జీవితాన్ని అంత దిగువ స్థాయికి దిగ‌జార్చుకోవ‌డానికి వారు ఎలా సిద్ధ‌ప‌డ‌తారో” అంటూ అంజ‌న ట్వీట్ చేశారు. మీడియాకి దూరంగా ఉండే అంజనా సైతం స్పందించారంటే శ్రీ రెడ్డి మాటలు ఆమెను ఎంత బాధించాయో అర్ధమవుతోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus